తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా కానిస్టేబుల్​, కంప్యూటర్ ఆపరేటర్‌, ఎస్సై మృతి - అసలేం జరిగింది? - WOMAN CONSTABLE DIED IN KAMAREDDY

కామారెడ్డి జిల్లాలో విషాదం - చెరువులో గల్లంతైన మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్‌ నిఖిల్‌, ఎస్సై సాయికుమార్‌ మృతదేహాలు లభ్యం

CONSTABLE COMPUTER OPERATOR DIED
Woman Constable and Computer Operator Died (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2024, 7:21 AM IST

Updated : Dec 26, 2024, 7:43 PM IST

Telangana Crime News :కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్సై సాయికుమార్, బీబీపేటలో కానిస్టేబుల్ శ్రుతితోపాటు బీబీపేట మండలానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్‌ నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వీరు ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ ఫోన్లతోపాటు ఎస్సై కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు అనుమానించారు. దీంతో బుధవారం రాత్రి గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బుధవారం అర్ధరాత్రి సమయంలో కానిస్టేబుల్ శ్రుతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన ఎస్సై సాయికుమార్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ రావడంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీయడం ప్రారంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి కూడా బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్​లో చెప్పి బయటికి వచ్చారు. మధ్యాహ్నమైనా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో కానిస్టేబుల్‌ శ్రుతి తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

శ్రుతి ఫోన్​ సిగ్నల్‌ ఆధారంగా ఆచూకీ :పోలీసు స్టేషన్​ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకు గురైన శ్రుతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. ఆమె ఫోన్​ సిగ్నల్‌ ఆధారంగా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించగా.. హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చెరువు వద్ద కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేటకు చెందిన నిఖిల్‌ మొబైల్​ ఫోన్లు దొరకగా భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌కు చెందిన కారు, పాదరక్షలు కనిపించాయి. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా మహిళ కానిస్టేబుల్‌ శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్సై సాయికుమార్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది.

ఎస్సై సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్​లో విధులు నిర్వహించారు. అక్కడే కానిస్టేబుల్​గా శృతి కూడా విధులు నిర్వహిస్తున్నారు. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్​గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటారని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురి మధ్య ఉన్న గొడవలేంటి? ఎస్సై, మహిళా కానిస్టేబుల్​తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న విషయాలు పోలీసులు వెల్లడిస్తేగానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.

'నన్ను పెళ్లి చేసుకో - లేదంటే చచ్చిపో' - మహిళ వేధింపులతోనే ఎస్సై ఆత్మహత్య

మన ప్రేమ విషయం మీ పై ఆఫీసర్లకు చెబుతా : యువతి బెదిరింపులతో ఎస్సై సూసైడ్!

Last Updated : Dec 26, 2024, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details