Woman Committed Suicide Jangaon :ఆ ఇద్దరు మహిళలు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వివాహ అనంతరం అందులో ఓ స్నేహితురాలు వేరే ఊరిలో స్థిరపడింది. వారు ఇరవురూ స్వగ్రామానికి వచ్చినప్పుడు ఎంతో ఆన్యోనంగా ఉండేవారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకునేవారు. కానీ ఇంతలోనే ఊహించని విధంగా వారిలో ఒక మిత్రురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మరో స్నేహితురాలు ఆమెను తలుచుకొని కుమిలిపోయేది. ఇంతవరకూ బాగానే ఉన్నా తాజాగా ఊహించని ట్విస్ట్ జరిగింది.
మృతి చెందిన మహిళ, తన కలలోకి వచ్చి తన దగ్గరకి రావాలని చెబుతోందని ఆమె స్నేహితురాలు కూడా ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అంతకుముందు తన అన్నయ్యకు ఫోన్ చేసి, అన్నయ్యా గతంలోఆత్మహత్య (Suicide) చేసుకున్న తన చిన్ననాటి స్నేహితురాలు వారం రోజులుగా తన కలలోకి వస్తోంది అతనికి తెలిపింది. తన దగ్గరికి రావాలంటోంది భయంగా ఉందని అంటూ మాట్లాడింది. అనంతరం ఉరి వేసుకొని సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో బుధవారం జరిగింది.
నువ్వు చస్తే మొదటి పెళ్లాం దగ్గరికెళ్తా - కళ్లెదుటే భార్య ఉరేసుకుంటుంటే వీడియో తీసిన భర్త
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన పోచంపల్లి కిష్టయ్య కూతురు రాధిక(33)ను 15 సంవత్సరాల కిందట ఖిలాషాపురం గ్రామానికి చెందిన యామంకి సుధాకర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. అన్యోన్యంగా జీవించేవారు. సదరు మహిళ బుధవారం తన సోదరుడు శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడింది. మూడు సంవత్సరాల కిందట ఆత్మహత్య చేసుకున్న స్వగ్రామంలో తనతో అన్యోన్యంగా ఉండే స్నేహితురాలు ఇటీవల తరచూ తన కలలోకి వచ్చి తన దగ్గరికి రావాలంటోందని చెప్పింది. తనకు భయంగా ఉందని సోదరుడుకి తెలిపింది. వీటిని పట్టించుకోవద్దని ఆయన చెల్లెలికి ధైర్యం చెప్పారు.