Wine Shops Close in Telangana:మండే ఎండల్లో కూల్ బీర్తో చిల్ అవ్వాలనుకున్న మందు బాబులకుషాక్ తగలనుంది. రాష్ట్రంలో 2 రోజుల పాటు వైన్ షాపులు, బార్ షాపులు మూతపడనున్నాయి. దీనికి గల కారణాలేంటి? మళ్లీ మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు వైన్స్ షాపులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. మే 13న పోలింగ్ జరగనుండగా ముందు నుంచే బంద్ పాటించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలతోపాటు అన్ని కల్లు కంపౌండ్లను సైతం మూతపడనున్నాయి.
నేటి నుంచే..
మే 11వ తేదీన శనివారం సాయంత్రం 6 నుంచి గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులను బంద్ చేయనున్నారు. తిరిగి మే 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. ఓట్ల కౌంటింగ్ రోజైన జూన్ 4న కూడా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.