తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య - ఆపై కిడ్నాప్ డ్రామా - Husband Missing Case

Wife Plans Husband Murder With Lover : ప్రియుడు మోజులో పడి ఓ భార్య కట్టుకున్న భర్తను హత్య చేయించిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అంతేకాకుండా తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని డ్రామా సురూ చేసి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం నమోదు చేసింది.

Sangareddy Crime News
Wife Plans Husband Murder With Lover

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 9:38 PM IST

Wife Plans Husband Murder With Lover :ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలతో జరుగుతున్న హత్యలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అటువంటి ఘటనే బయటపడింది.ప్రియుడు మోజులో ఓ భార్య కట్టుకున్న భర్తను హత్య చేయించింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

పెళ్లైనా ప్రియుడితోనే ప్రేమాయణం- కుమార్తెను చంపి కట్టుకథ అల్లిన తండ్రి

అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు(Complaint) సైతం చేసింది. లోతుగా విచారణ చేసిన పోలీసులు ప్రియుడు, మరికొంతమందితో కలిసి హత్య చేసి కాల్చివేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు వివరాలను జిల్లా డీఎస్పీ రమేశ్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

భర్తను హత్య చేసి కిడ్నాప్​గా డ్రామా :జోగిపేట పట్టణానికి చెందిన మల్లేశంకు మండలం పరిధిలోని మన్​సాన్​పల్లి గ్రామానికి చెందిన కల్పనతో 2015లో వివాహమైంది.పెళ్లి కాకముందే కల్పన, తన ఇంటి పక్కన ఉన్న మచ్చుకూరి మహేశ్​తో ప్రేమాయణం నడిపింది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె మహేశ్​తో కలుస్తూ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఎలాగైనా అతని తొలగించుకోవాలని కల్పన, ప్రియుడు మహేశ్ పథకం పన్నారు.

మచ్చుకూరి మహేశ్ ఈ పథకం విషయాన్ని తన మేనమామ కొడుకు అంబాజీకి తెలిపి సహకరించాలని కోరాడు. ఇందుకోసం కల్పన భర్తను చంపడానికి రూ.50,000 ఒప్పందం(Agreement) కుదుర్చుకున్నారు. ఈనెల 19న ప్రియుడు మచ్చుకూరి మహేశ్, అతని బావ అంబాజీతో పాటు మరో ముగ్గురు కలిసి జోగిపేటకు వచ్చారు. కల్పన భర్త బయట బండిపై వెళ్తుంటే, అతనిని అడ్డగించి వెనుక నుంచి రాయితో తలపై గట్టిగా కొట్టారు.

ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న కారులో అతన్ని వెనుక సీట్లో వేసుకొని, మెడపై కాలితో గట్టిగా నొక్కి హత్య చేశారు. ఆ తర్వాత మెదక్ జిల్లా రామంపేట గ్రామ శివారులోని కోనాపూర్ చెరువు వద్ద శవాన్ని తగలబెట్టారు. ఫోన్ కాల్స్ ఆధారంగా కల్పనను పోలీసులు గట్టిగా నిలదీయడంతో, భర్త హత్యకు పన్నిన పథకం బయట పడింది. దీంతో ప్రియుడు మచ్చూరి మహేశ్​తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ రమేశ్ పేర్కొన్నారు.

కల్పన భర్త హత్య ప్లాన్ ప్రకారం జరిగింది. బండిపై వెళ్తున్న అతన్ని మార్గమధ్యలో అడ్డగించి, ఒక రాయితో వెనుక నుంచి కొట్టారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, అనుకున్న విధంగా వారి వెంట తెచ్చుకున్న కారులో అతడ్ని ఎక్కించుకొని పారిపోయారు. వెనుక సీట్లో అతన్ని వేసుకొని, పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ గొంతు నులిమి చంపారు. అనంతరం నిర్మాణుష్య ప్రాంతం చూసుకొని శవాన్ని పెట్రోల్ పోసి తగలపెట్టారు.-రమేశ్ కుమార్, డీఎస్పీ

ప్రియుడు మోజులో భర్తను హత్య చేయించిన భార్య - ఆపై కిడ్నాప్ డ్రామా

భార్య తల నరికిన భర్త - వివాహేతర సంబంధం అనుమానంతో దారుణం

మరొకరితో సన్నిహతంగా ఉంటోందనే హత్య - వికారాబాద్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

ABOUT THE AUTHOR

...view details