తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంట్లో ఎవరూ లేరంటూ పిలిచి - భర్తతో కలిసి ప్రియుడిని కడతేర్చిన వివాహిత - యువకుడిని చంపిన వివాహిత

Wife And Husband killed Young Man In Chennur : ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. ఆ మోజులో పడి ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కమ్మరిపల్లిలో ప్రియుడు తరచూ వేధిస్తున్నాడని భర్త, తల్లిదండ్రులతో కలిసి ఓ వివాహిత ప్రియుడిని కడతేర్చింది.

Married Woman Killed Young Man In Mancherial
Wife And Husband killed Young Man In Chennur

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 11:47 AM IST

Wife And Husband killed Young Man In Chennur: వేధిస్తున్న తన ప్రియుడిని హత్య చేయాలని కుటుంబసభ్యులతో కలిసి ఆమె పథకం పన్నింది. ఇంట్లో ఎవరూ లేరని పిలిచి భర్త, తల్లిదండ్రులతో కలిసి అతడిని కడతేర్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కమ్మరిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కమ్మరిపల్లికి చెందిన మొగిలి సుగుణక్క - ఓదెలు దంపతుల కుమార్తె పద్మను 12 ఏళ్ల క్రితం మండలంలోని పొన్నారంవాసి బట్టె శేఖర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇదే గ్రామానికి చెందిన రామగిరి మహేందర్‌(28) హార్వెస్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం పద్మతో అతడికి పరిచయం ఏర్పడింది.

నలుగురి పిల్లల తల్లితో యువకుడి ప్రేమాయణం- ఇంటికి పిలిచి ప్రైవేట్​ భాగాలు కట్​ చేసిన లవర్​!

Married Woman Killed Young Man In Mancherial:ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. నాలుగు నెలల క్రితం మహేందర్‌తో కలిసి పద్మ వెళ్లిపోయింది. దీంతో తన భార్య తప్పిపోయిందని శేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గత నవంబరులో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా భర్తతో ఉండేందుకు ఇష్టం లేక మహేందర్‌తో తిరిగి వెళ్లిపోయింది. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో నెల క్రితం పద్మ కమ్మరిపల్లికి వచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది.

ఈ క్రమంలోనే మహేందర్‌ తరచూ కమ్మరిపల్లికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతడిని వదిలించుకోవాలని పద్మ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో శేఖర్‌ కమ్మరిపల్లికి వచ్చాడు. భర్త, తల్లిదండ్రులతో కలిసి అతడిని అంతమొందించాలని పద్మ పథకం పన్నింది. మంగళవారం రాత్రి పద్మ, మహేందర్‌కు ఫోన్‌ చేసి ఇంట్లో ఎవరూ లేరని, రావాలని చెప్పింది.

భార్యతో వివాహేతర సంబంధం, సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డ కానిస్టేబుల్

మహేందర్‌ కమ్మరిపల్లికి చెందిన కడారి శేఖర్‌, జాలంపల్లి సాయిరాజ్‌లతో కలిసి గ్రామంలోకి వచ్చాడు. ఇద్దరిని ఇంటి సమీపంలో ఉంచి ఇంట్లోకి వెళ్లగా, కంట్లో కారంచల్లి కర్రలతో చితకబాదడంతో మహేందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎడ్లబండిలో గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు. అంతకు ముందు మహేందర్‌ అరుపులు, కేకలు విన్న బయట ఉన్న ఇద్దరు, మృతుడి సోదరుడు రవీందర్‌కు కాల్ ​చేసి చెప్పగా, ఆయన పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించారు. పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లి దహనమవుతున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూరు ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలాన్ని మంచిర్యాల డీసీపీ సుధీర్‌ రాంనాథ్‌కేకాన్‌, జైపూరు ఏసీపీ మోహన్‌, సీఐలు రవీందర్‌, బన్సీలాల్‌ పరిశీలించారు. నిందితులు పద్మ, శేఖర్‌, మొగిలి ఓదెలు, సుగుణక్క పారిపోయేందకు చెన్నూరు బస్టాండ్‌కు వెళ్లగా, పోలీసులు పట్టుకొని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతుడి సోదరుడు రవీందర్‌ ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ సుధీర్‌ రాంనాథ్‌కేకాన్‌ వివరించారు.

సినిమాను తలపించేలా హత్య - వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపించిన భార్య

భార్య తల నరికిన భర్త - వివాహేతర సంబంధం అనుమానంతో దారుణం

ABOUT THE AUTHOR

...view details