Warangal MGM Special OP Service For Disabled : ఉత్తర తెలంగాణకి ఆరోగ్య ప్రధాయినిగా భావించే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి నిత్యం రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు గంటలు తరబడి క్యూలో వేచి ఉండాల్సివస్తోంది. ఈ తాకిడిని తట్టుకుని చికిత్స చేయించుకోవాలంటే సాధారణ రోగులకే కత్తిమీదసాము లాంటిది. అలాంటిది దివ్యాంగులైతే ఇక చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను వివిధ సంఘాలు అనేకసార్లు నిరసనలు, ధర్నాలు చేపట్టి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎంజీఎం వైద్యుల 'ఓపెన్ హార్ట్ సర్జరీ' విజయవంతం.. చరిత్రలోనే ఓ మైలురాయిగా..
"దివ్యాంగులకు ఓపీ సేవలు వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటాయి. జిర్యాట్రిక్ ప్రారంభించి రెండు సంవత్సరాలు అయ్యింది. సిబ్బంది అసోసియేట్ నుంచి చాలా సార్లు రిప్రజెంట్ చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో స్థలం కొరత ఉంది. దివ్యాంగులకు కోసం ప్రత్యేక ఓపీ ప్రారంభించాం. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఓపీ ఉండాలని, ఇతర రోగులు పాటు ఇబ్బందులు పడకూడదని వారికంటూ ఒక వైద్యుడితో వైద్యం అందించాలనుకున్నాం. జర్వం, దగ్గు, బీపీ, హైపర్ టెన్షన్ వీటి కోసం కూడా పెద్ద క్యూలైన్లో నిలబడాలంటే కష్టం కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం అలోచిస్తున్నాం." - డా.చంద్రశేఖర్, సూపరింటెండెంట్, ఎంజీఎం, వరంగల్
Oxygen : ఎంజీఎంకు రూ.20లక్షలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు