తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసు - కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు - vizag Drug bust - VIZAG DRUG BUST

Visakhapatnam Drugs Container Case : విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్‌ కంటైనర్‌ను విశాఖ కంటైనర్‌ పోర్టులోనే ఉంచారు. ప్రస్తుతానికి కస్టమ్స్‌, సీబీఐ అధికారుల భద్రతలో డ్రగ్స్‌ కంటైనర్‌ ఉంది. సీబీఐ ప్రత్యేక అధికారుల బృందం విశాఖలోనే మకాం వేశారు. కంటైనర్‌కు సంబంధించి రికార్డులు, పత్రాలు తనిఖీ చేస్తున్నారు.

Visakhapatnam Drugs Container Case
విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసు - కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 12:36 PM IST

Visakhapatnam Drugs Container Case : బ్రెజిల్‌ నుంచి విశాఖ పోర్టుకు రూ.లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి కావడం సంచలనం కలిగిస్తోంది. కంటైనర్‌లో బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన 25 వేల కిలోల డ్రగ్స్​ను సీబీఐ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విశాఖలోని డ్రగ్స్ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

డ్రగ్స్‌ కంటైనర్‌ను విశాఖ కంటైనర్‌ పోర్టులో ఉంచారు. కస్టమ్స్‌, సీబీఐ అధికారుల భద్రతలో డ్రగ్స్‌ కంటైనర్‌ ఉండగా, విశాఖలోనే సీబీఐ ప్రత్యేక అధికారుల బృందం మకాం వేసింది. కంటైనర్‌కు సంబంధించిన రికార్డులు, పత్రాలు తనిఖీ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన చైనా నౌక ద్వారా కంటైనర్‌ విశాఖ వచ్చినట్లు గుర్తించారు.

విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత- 25వేల కిలోలు స్వాధీనం చేసుకున్న సీబీఐ - CBI SEIZED 25 THOUSAND KGS DRUGS

బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి కంటైనర్‌ ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ బ్యాగ్‌లతో విశాఖకు బయలుదేరినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ కంటైనర్‌ సంధ్యా ఆక్వా పేరుతో బుక్‌ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్‌ను స్క్రీనింగ్‌ చేశారు. ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు. ఇంటర్‌ పోల్‌ అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో సీబీఐ రంగంలోకి దిగింది.

ఇంటర్‌ పోల్‌ సమాచారంతో కంటైనర్‌ కోసం నౌకను సీబీఐ ట్రాక్‌ చేసింది. విశాఖలో కంటైనర్‌ దించి తమిళనాడు కట్టుపల్లి పోర్టుకు నౌక వెళ్లినట్లు తెలుసుకున్నారు. డ్రగ్స్‌ కంటైనర్‌ను విశాఖలో దించినట్లు నౌకా సిబ్బంది ద్వారా సీబీఐ నిర్ధారించుకున్నారు. దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందం, కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. కంటైనర్‌లో 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగుల్లో డ్రైడ్‌ ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న నమూనాలు సేకరించి పరిశీలించగా, సేకరించిన 49కి గానూ 27 నమూనాల్లో డ్రగ్స్‌ గుర్తించారు.

హైదరాబాద్​లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు - రూ.9 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం​ - Huge Drug Bust In Hyderabad

మరోవైపు సంధ్య ఆక్వా సంస్థలో 2 రోజుల క్రితమే సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. సంధ్య ఆక్వా పరిశ్రమలో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ ఉన్నట్లు తేలడంతో ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన సంధ్యా ఆక్వా కంపెనీ డైరెక్టర్‌, ప్రతినిధులను సీబీఐ టీం ప్రశ్నించింది. కంపెనీ ప్రతినిధులు తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సీబీఐ అధికారులు తెలిపారు. రొయ్యల ఆహార తయారీకి కాంపోజిషన్‌ దిగుమతి చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాంపోజిషన్‌ దేనితో తయారు చేస్తారో తెలియదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

అదే విధంగా ఒక్కో బ్యాగ్‌లో ఎంత మేర డ్రగ్స్‌ ఉన్నాయనే లెక్క తేల్చాల్సి ఉంది. ఈ డ్రగ్స్ అత్యంత ఖరీదైనవిగా అధికారులు చెబుతున్నారు. ఒకవేళ 25 వేల కిలోల్లో భారీ మోతాదులో డ్రగ్స్ లభిస్తే, రూ.లక్షల కోట్ల విలువైన డ్రగ్స్‌ రాకెట్‌గా ఈ కేసు నిలుస్తుంది. ఇందులో అంతర్జాతీయ నేర ముఠా ప్రమేయం ఉండొచ్చని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details