Viral Fevers in Nalgonda District :నల్గొండ జిల్లాలోని పలు గ్రామాల్లోని ప్రజలు జ్వరంతో అల్లాడుతున్నారు. మూడు నెలలు నుంచి జ్వరం, ఒళ్లు నోప్పులు, ముఖంపై నల్లటి మచ్చలు, కాళ్లు వాపుతో బాధపడుతున్నారు. కొంతమందిలో చికున్‌గన్యా, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నప్పటికి.. రక్త పరీక్షలు చేస్తే మాత్రం ఏమీ లేదని వస్తోంది. జ్వరం వారం రోజులకు తగ్గినా.. కీళ్లనొప్పులు మాత్రం నెలలు గడిచినా తగ్గడం లేదు. దానికి తోడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Viral Fever in Nalgonda : విషజ్వరాలతో తల్లడిల్లుతున్న నల్గొండ.. రోగులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
జిల్లాలోని మాడ్గులపల్లి, నిడమానూరు, శాఖపురం, పార్వతీపురం, పెద్దవూర, యడవల్లి వివిద ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ తగ్గుముఖం పట్టినా, ఇందుగుల గ్రామంలో ఏ ఇంట్లో చూసినా జ్వర బాధితులే ఉన్నారు. ఫీవర్ వారం రోజుల తర్వాత తగ్గినా, కీళ్లనొప్పులు మాత్రం నెలలు గడిచినా తగ్గడం లేదు. ముఖంపై నలుపు రంగు మచ్చలు ఏర్పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. మందులు వాడుతున్న రోజులు తగ్గి తర్వాత మళ్లీ అదే తరహాలో జ్వరం వస్తుంది.
"40రోజులు మాకు జ్వరాలు రాబట్టి. ఎక్కడికి పోయినా దోముకాటు వల్ల వచ్చింది అంటూ మందులు ఇస్తున్నారు. కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. మందులు వాడుతున్నన్ని రోజులు తగ్గుతుంది మళ్లీ అలాగే జ్వరం, ఒళ్లు, కాళ్ల నొప్పులు వస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి అందరి పరిస్థితి ఇదే. ఎందువల్ల వస్తుందని ఎవ్వరికి తెలియడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి పోతే చాలా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ కరువు రోజుల్లో అన్ని డబ్బులు పెట్టాలి అన్నా మా దగ్గర లేవు." - బాధితులు