Vigilance Inquiry Speed up on Kaleshwaram Project :కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక - డీపీఆర్ అంచనాలో అదనపు టీఎంసీకి ఆస్కారం లేకపోయినా, సివిల్ పనులకు అంచనాలు తయారు చేసినట్లు ప్రాజెక్టు మాజీ ఇంజినీర్ ఇన్‌చీఫ్ వెంకటేశ్వర్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు వెల్లడించారు. ఏ అధికారంతో ఆ విధంగా సిఫార్సు చేశారని ప్రశ్నించగా, ప్రస్తుతం సమాధానం ఇవ్వలేనని, రికార్డులు పరిశీలించి తర్వాత చెప్తానని పేర్కొన్నట్లు తెలిసింది.
సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపి, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని గుత్తేదారుకు బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇవ్వాలంటూ ఎలా సిఫార్సుచేశారని ప్రశ్నించగా, ఎస్‌ఈ నివేదిక ఆధారంగా ఉన్నతస్థాయి కమిటీకి(High level committee) పంపానని చెప్పినట్లు తెలిసింది. పలు నిర్ణయాలకు కిందిస్థాయి ఇంజినీర్ల నివేదికలే ఆధారమని పేర్కొన్నారని అనేక అంశాలకు తర్వాత సమాధానం ఇస్తానని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
Vigilance investigation on Medigadda Project :కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లను విచారిస్తోంది. కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును ప్రశ్నించగా మిగిలిన ఇంజినీర్లను త్వరలోనే విచారించనుంది. వెంకటేశ్వర్లుకు 30కి పైగా ప్రశ్నలు సంధించింది. ఒప్పందంమేరకు మేడిగడ్డ ప్రారంభంతో పని పూర్తైనట్లు భావిస్తున్నారా అని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా, లేదని ఈఎన్‌సీ సమాధానమిచ్చారు.
డ్రాయింగ్‌లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం
ప్రాణహిత-చేవెళ్ల పునరాకృతి ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టడానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు అడిగినట్లు తెలిసింది. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని పిలిచినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలించి తనిఖీనోట్స్ ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించగా, తనిఖీ చేసినట్లు చెప్పారు.
అందుకు సంబంధించిన వివరాలను తర్వాత ఇస్తానని తెలిపారు. పనిలో సౌలభ్యం కోసం సీకెంట్ పైల్స్ అనుమతించాలని గుత్తేదారు కోరగా సీడీఓ చీఫ్ ఇంజినీర్‌కు పంపే ముందు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశారా అని అధికారులు ప్రశ్నించగా, ఆర్ధికభారంపై విశ్లేషించినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు. ఐతే అందుకు సంబంధించిన వివరాలను మాత్రం తర్వాత సమర్పిస్తానని తెలిపారు.
Vigilance Officers Inspect to Irrigation ENC :అప్పటి సీఎం ప్రాజెక్టును పరిశీలించినపుడు ఆదేశించారని బ్యారేజీ ఎగువన, దిగువన సీసీ బ్లాకుల సైజులో మార్పు చేశారని. కొత్త సైజు సీసీ బ్లాకులకు సిఫార్సు చేసే ముందు దీన్ని బలపరిచేలా మోడల్ స్టడీస్ టెక్నికల్ స్టడీస్ చేశారా అని అధికారులు అడగ్గా అందుకోసం ఎలాంటి మోడల్ స్టడీస్ చేయలేదని వివరించారు. ఆమోదించిన డ్రాయింగులకు అనేక సార్లు సవరణలు సిఫార్సు చేశారు.