Vigilance investigation on Mission Bhagiratha: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలు చేసింది. సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయగా, ఆరేడు వేల కోట్ల విలువైన పనుల్లో అవినీతి జరిగినట్టు సర్కారు అనుమానిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయమై దర్యాప్తు సంస్థ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే చర్చించినట్లు సమాచారం.
కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ - విచారణ జరిపించాల్సిందే : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
Vigilance Enquiry On Misssion Bhagiratha Project: మిషన్ భగీరథ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఫిర్యాదులు రావడంతో దీనిపై సర్కారు ఫోకస్ చేసింది. జరిగిన పనులనే కొత్తగా చేసినట్లుగా నమోదు చేయడం, సామగ్రి కొనకుండానే కొన్నట్లు దస్త్రాల్లో చూపించడం, కొనుగోలు చేసిన పరికరాలు వినియోగించకుండా పక్కన పడేసి అక్రమంగా బిల్లులు లేపుకున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ జరిపించాలనే నిర్ణయానికి సర్కారు వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోపణలు నిగ్గు తేల్చే క్రమంలో మండలానికి ఒక గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్టు, సంబంధిత మంత్రి కూడా విజిలెన్స్ అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ - ఫౌంటేన్‌లా ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు