Vice President Visit Bharat Biotech in Hyderabad: రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన భారత్ బయోటెక్ సంస్థను దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆయన సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్‌తో కలిసి సందర్శించారు. సంస్థ ఆవరణంలో ఉన్న ఔషధ మొక్కలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్ రాధాకృష్ణన్ నీళ్లు పోశారు. సవాళ్ల సమయంలో సంస్థ అంకిత భావాన్ని స్థితిస్థాపకతను కొనియాడారు.
పెట్టుబడులను ఆకర్షించాలంటే స్పెషాలిటీ కెమికల్స్‌పై దృష్టి పెట్టాలి : కృష్ణ ఎల్ల
Vice President Speech on Bharat Biotech : రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనకు మొదటిగా గవర్నర్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం భారత్ బయోటక్‌కు వెళ్లారు. సంస్థ పరిశోధనలు, తయారుచేస్తున్న వ్యాక్సిన్ల గురించి భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఎండీ సుచిత్ర ఎల్లా వివరించారు. సంస్థ సేవలను ఉప రాష్ట్రపతి మెచ్చుకున్నారు. పరిశ్రమ, విద్యాసంస్థలు తదితర అన్ని రంగాలలో మరింత పరిశోధనలకు మద్దతునిచ్చేలా సహకారం అందించాలని కోరారు.
సమాజ అవసరాల కోసం శాస్త్రవేత్తలు సాహసోపేత ప్రయోగాలు చేయాలి: కృష్ణ ఎల్ల
వ్యాక్సిన్లు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఎంతో కీలకం: కృష్ణ ఎల్ల