Venkaiah Naidu Ugadi Wishes 2024 :ఈ ఏడాది అంతా సంతోషంగా, ప్రకృతితో కలిసి జీవించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉగాది పర్వదినం వేళ కొత్త సంకల్పం తీసుకోవాలని సూచించారు. భారత్‌ను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దడంలో కృషి చేద్దామని ప్రజానికానికి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్(Swarna Bharat Trust) ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్ సీపీ రాధా కృష్ణన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు.
Ugadi Celebrations at Swarna Bharat Trust at Muchintal :పంచాంగ శ్రవణం పూర్తి అయిన తర్వాత మాజీ ఉపముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశ ప్రగతిలో మనమంతా భాగస్వామ్యం కావాలని తెలిపారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరారు. భారత్‌ను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దడంలో కృషి చేద్దామని, సాధారణంగా సూపర్ పవర్ అనగానే అమెరికా, ఐరోపా సమాఖ్య, చైనా గుర్తుకు వస్తాయన్నారు. త్వరలో భారత్ కూడా సూపర్ పవర్‌గా ఆవిర్భవించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్(India is Third Economic Power in World) ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు.
"ప్రభుత్వ సాయం నేరుగా పేదలకు అందేలా ప్రధాని మోదీ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాం. దళారులు లేకుండా ప్రభుత్వ లబ్ధి కుటుంబాలకు అందుతోంది. పదేళ్లుగా 7 శాతం వరకు వృద్ధిరేటు సాధిస్తున్నాం. మనదేశం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. దేశ ప్రగతిలో మనమంతా భాగస్వాములు కావాలి. అందరూ సుఖశాంతులతో, సంతోషంగా ఉంటేనే దేశాభివృద్ధి." - వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి
"ఉగాది అనేది తెలుగు వారికి ముఖ్యంగా మరింత ప్రత్యేకమైన పండుగ. కాలాన్ని గౌరవించుకునే పండుగ. జగత్‌లోని చైతన్యాన్ని మేల్కొలిపి సరికొత్త ఆశయాలతో లోక కల్యాణార్థం మంచి ఆలోచనలు రంగరింపజేసే శుభదినమే ఉగాది. ఎప్పటికప్పుడు మారే కాలం మనలో కూడా అనేక మార్పును తీసుకువస్తుంది. అలాంటి కాలంతో పాటు వచ్చే మార్పులను తెలియజేస్తూ అదే సమయంలో గతాన్ని గుర్తుపెట్టుకుంటూ వర్తమానంలో మనిషి ముందుకు సాగాలి."- వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
వసంత నవరాత్రులు ప్రారంభం- తొమ్మిది రోజులు ఇలా చేస్తే పరిపూర్ణ అనుగ్రహం!