Vedire Sriram on Krishna and Godavari Projects :నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాంలు ప్రమాదంలో పడ్డాయని కేంద్ర జల్ శక్తి మంత్రి సలహాదారు, నదుల అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ వెదిరె అన్నారు. ఇరు ప్రభుత్వాలు ఏపీ రీ ఆర్గనైజేషన్ ప్రకారం కేబీఆర్ఎం(KRMB) సహకారం తీసుకుని సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని కవాడీగూడ సీబీఓ టవర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల స్థితి, మేడిగడ్డ సమస్య, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికార పరిధి వంటి విషయాలపై స్పందించారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు, నిర్వహణ, తాజా పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మానవ తప్పిదం వల్ల సరైన నిర్వహణ లేకపోవడంతో రెండు ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్నాయని, వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ వెదిరె(Sriram Vedire) ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు దిక్కు లేదని ఈ విషయాన్ని నేషనల్ సేఫ్టీ అథారిటీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరించిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విఫలమయ్యాయని ఇరు రాష్ట్రాల ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌కు సంబంధించిన కొత్త నిబంధనలను టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ వెదిరె వెల్లడించారు.
సాగర్‌ను పరిశీలిస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం - నీటి నిల్వలు, స్పిల్ వేలపై ఆరా!
Sriram Vedire Press Meet in Hyderabad : ఇద్దరూ గొడవపడితే తాము ఎలా బాధ్యత వహిస్తామని శ్రీరామ్ వెదిరె సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జలాలు(Krishna Water) కేఆర్ఎంబీకి తాకట్టు పెట్టారని అనడం తప్పు, ప్రాజెక్టులు స్వాధీనం చేసుకుని ఏం చేస్తామని అన్నారు. ప్రజల్లో భ్రమలు కల్పించి ఎమోషనల్ సృష్టించడం సరికాదని హితవుపలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఎక్కువగా ఖర్చు అయ్యాయని, ఆ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వెచ్చిస్తే 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని తేల్చి చెప్పారు.