Vande Bharat First Sleeper Train :వందేభారత్ తొలి స్లీపర్ రైలును ఆగస్టులో పట్టాలు ఎక్కించేందు రైల్వేశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య విడతలవారీగా వాటిని ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు సికింద్రాబాద్ - ముంబయి నగరాల మధ్య వచ్చే అవకాశముంది.
ఈ నగరాల మధ్య ఇప్పటివరకు వందేభారత్ రైళ్లు లేని కారణంగా తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలో నడపాలని కేంద్ర గనుల శాఖ, సికింద్రాబాద్ ఎంపీ దక్షిణ మధ్య రైల్వే అరుణ్‌న కుమార్‌కు సూచించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు సికింద్రాబాద్-పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ ట్రైన్ (సిట్టింగ్) రానున్నట్లు తెలిసింది.
వందే భారత్ రైళ్లకు వస్తున్న ఆదరణ అద్బుతం : దక్షిణ మధ్య రైల్వే జీఎం
వందే భారత్ స్లీపర్ రైల్లో ఉంటే సదుపాయాలు ఇవే :
- సులభంగా రైలులోకి ప్రవేశించేందుకు వీలుగా మెట్ల ప్రదేశాన్ని పెంచుతున్నారు.
- టాయిలెట్లను కొత్త డిజైన్లతో రూపొందిస్తున్నారు. ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు.
- సీట్ కుషన్లను కొత్త టెక్నాలజీతో మారుస్తున్నారు. 99శాతం వైరస్ను కట్టడి చేసి, ఆక్సిజన్ లెవల్స్ సరిగ్గా ఉండేలా చూస్తారు.
- స్లీపర్ కోచ్ ఎలాంటి కుదుపులు, శబ్ధాలు లేకుండా ఉంటుందని, ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.