తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 6:43 PM IST

ETV Bharat / state

గొర్రెల పంపిణీ స్కామ్​ కేసు - మరో ఇద్దరు కీలక వ్యక్తుల అరెస్టు - Sheep Distribution Scam Case Update

Sheep Distribution Scam Case Update : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్​ కేసులో మరో ఇద్దరిని ఏసీబీ అరెస్టు చేసింది. రూ.2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ మాజీ సీఈ రాంచందర్‌ రావు, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Sheep Distribution Scam Case
Sheep Distribution Scam Case Update (ETV Bharat)

Two Persons Arrest in Sheep Distribution Scam Case :రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. పశు సంవర్ధక శాఖ మాజీ సీఈ రాంచందర్‌ రావు, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. ప్రభుత్వ సొమ్మును రాంచందర్‌రావు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రాంచందర్‌రావు, కల్యాణ్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు, వారిని రిమాండ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details