Two people Arrested In Investment Fraud in Hyderabad :కేరళకి చెందిన నౌషద్, కబీర్, ఇసాక్, తాహిర్ అలీ అనే నలుగురు వ్యక్తులు తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ నేరాలకు అలవాటు పడ్డారు. ఇసాక్, తాహిర్ పెట్టుబడులకు లాభాల పేరుతో సైబర్ మోసాలు చేస్తుంటారు. నౌషద్, కబీర్ నకిలీ ధ్రువపత్రాలతో మొత్తం 18 బ్యాంకు ఖాతాలు తెరిచారు.
నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని పార్ట్‌టైమ్ జాబ్ ఉందని నమ్మించి టెలిగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు. ఎవరైనా అమాయకులు స్పందిస్తే లైకులు, రేటింగ్ ద్వారా కామెంట్లు ఇవ్వాలని ఉసిగొల్పుతారు. బదులుగా తాము కమీషన్ ఇస్తామని నమ్మిస్తారు. టాస్కుల పేరుతో రేటింగులు ఇచ్చాక పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపిస్తారు. తద్వారా ముందుకొచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేసి తర్వాత అడ్రస్ లేకుండా పోతారు.
Kerala Cyber Criminals Arrested by Hyderabad Police :ఈ ఏడాది జనవరిలో నగరానికి చెందిన ఓ బాధితుడికి టెలిగ్రామ్‌లో సందేశం వచ్చింది. తాత్కాలిక ఉద్యోగం ఉందని టెలిగ్రామ్ గ్రూపులో చేర్చి లింకు పంపించారు. నిందితుల సూచన మేరకు బాధితుడు ఓ యాప్ డౌన్‌లోడ్ చేశాడు. కొన్ని కంపెనీలకు ఫైవ్ స్టార్ రేటింగ్, కామెంట్లు పెట్టాలని చెప్పి కొంత మొత్తం డబ్బును బాధితుడి బ్యాంకు ఖాతాకు పంపారు. ఆ తర్వాత నమ్మించి పెట్టుబడికి లాభాలు ఇస్తామని రూ.9లక్షల 44 వేలు వసూలు చేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
టాస్క్ పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు - రూ.49.45 లక్షలు దోచుకున్నారు