Interstate Drug Peddlers Gang Arrested in Hyderabad : నగరంలో చాప కింద నీరులా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్నట్లు సమాచారంతో సరిహద్దుల్లో పోలీసులు నిఘాా ఉంచారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ మీదుగా రాచకొండ పోలిస్ కమిషనరేట్ ప్రాంతాల్లో నుంచి హైదరాబాద్‌కు గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు.
అందులో రవి, సయ్యద్, ఆనంద్ రామ్జీ నుంచి 100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని హుమాయ్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తే, అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మరో కేసులో భవానీనగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో 64 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు షేక్ పర్వేజ్ పైనా ఉమ్మడి రాష్ట్రంలో మూడు ఎన్డీపీఎస్ కేసులో నమోదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లంగర్ హౌజ్ ఎన్డీపీఎస్ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత గంజాయి రవాణా చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా పట్టుబడిన గంజాయి - ఐదుగురు అరెస్టు