Two Daughters Stay With Mother Dead Body In Same Home In Hyderabad :అకస్మాత్తుగా తల్లి మృతి చెందడం ఆమె ఇద్దరు కుమార్తెలను మానసికంగా కుంగిపోయేలా చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో 4 రోజులుగా ఉండిపోయారు ఆ అమ్మాయిలు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ వారాసిగూడలో ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే,
హార్ట్ ఎటాక్‌తో మృతి : సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్‌లో ఓ మహిళ మృతి చెందింది. ఇంట్లో నుంచి చెడు వాసన రావడంతో స్థానిక ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. మహిళ మృతి చెందిన 4 రోజులు అవుతోందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె హార్ట్ ఎటాక్‌తో మరణించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.