TTD Board Meeting in Tirumala :శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతి సౌకర్యాల్లో ఇబ్బంది లేకుండా చూస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సులభతరమైన శ్రీవారి దర్శనం కోసం కొన్ని సూచనలు వచ్చాయని అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో శ్యామలరావు మాట్లాడారు.
ఫీడ్ బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు :తిరుమలలో తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్యామలరావు తెలిపారు. తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని, తగినంత సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయించినట్టు ఈవో చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు చేస్తాం : టీటీడీ ఈవో శ్యామలరావు
ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం :తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని శ్యామలరావు తెలిపారు. అందుకు మార్గదర్శకాలను కమిటీ వేసి రూపొందిస్తున్నామని, ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మాణం చేపడతామని వెల్లడించారు. స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తామని, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో స్విమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నడక భక్తుల ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
టీటీడీ సేవలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. తిరుపతిలోని కంచి కామకోటి సంప్రదాయ పాఠశాలకు 2 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని అన్నారు. టీటీడీలో ఆహార భద్రత బోర్డుకు పాలక మండలి ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు.
"శ్రీవారి దర్శనం, వసతి సౌకర్యాల్లో ఇబ్బంది లేకుండా చూస్తాం. తిరుమలలో తక్కువధరకే మంచి ఆహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. టీటీడీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మిస్తాం. నడక భక్తుల ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం" టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమల శ్రీవారి సేవకు వెళ్తున్నారా? - టీటీడీ సూచనలు తెలుసా? - Tirumala Srivari Brahmotsavam 2024