ETV Bharat / state

బీటెక్‌ అయిపోగానే జాబ్ కావాలా? - నిపుణుల సూచనలు ఇవే - WHICH IS BETTER AFTER BTECH

బీటెక్‌ చివరి ఏడాది చదువుతున్నారా? - తర్వాత ఎంటెక్‌ చదవాలా? ఉద్యోగం చేస్తే కెరియర్‌ను ఎలా ఎంచుకోవాలి? - విద్యా నిపుణులు ఏం చెప్తున్నారంటే!

After Btech Job or Higher Studies Which is Better
After Btech Job or Higher Studies Which is Better (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2024, 5:00 PM IST

Updated : Dec 26, 2024, 12:45 PM IST

After Btech Job or Higher Studies Which is Better : చాలా మంది విద్యార్థులు బీటెక్‌ (Btech) పూర్తైన తరువాత ఏమి చేయాలి అనే ఆలోచనలో పడతారు. ఉద్యోగం చేయాలా లేక మాస్టర్స్‌ చేయాలా అన్న ప్రశ్న వారి మొఖంలో కనిపిస్తుంది. అలాంటి వారికి నిపుణులు ఏమి చేప్తున్నారంటే బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారంటే అప్పటికే కెరియర్‌ గురించి ఒక నిర్ణయానికి రావాలని అంటున్నారు. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం మొదట్లోనే బీటెక్ తరువాత ఏమి చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశలో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎంటెక్‌ (MTech) చేయాలా? ఉద్యోగం చేయాలా? అన్నది వారి వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని వాళ్ల ఆర్థిక స్థోమత, కుటుంబ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి.

Guidelines To BTECH Students in Telugu : ఎంటెక్‌ చేయాలి అనుకుంటే గేట్‌ 2025 (GATE 2025) రాసి మంచి ర్యాంకు సాధించాలి. ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లోలాంటి వాటిల్లో ప్రవేశం పొందాలి. ప్రస్తుతం మీరు చదువుతున్న బీటెక్‌ కాలేజీ కంటే మెరుగైన ర్యాంకున్న ఎంటెక్‌ కాలేజీని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒకవేళ ఎంఎస్‌ (MS) చేసే ఆలోచనలో ఉంటే ఐఈఎస్‌టీఎస్‌/టోఫెల్‌, జీఆర్‌ఈ లాంటి పరీక్షలు రాయాలి. వీటిలో మంచి స్కోరు సాధిస్తే ఇతర దేశాల్లో మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తోంది. ఎంటెక్‌/ఎంఎస్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌ లాంటి సబ్జెక్టులు చదివే అవకాశం ఉంటుంది.

ఫారిన్​లో హయ్యర్ స్టడీస్​ చేయాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Abroad Higher Education Guide

ముందు ఒక నిర్ణయానికి రండి : ఉద్యోగం చేయాలి అనుకుంటే మీ కాలేజీల్లో ఏవైనా కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం వస్తే, వాటిలో పాల్గొన్నారా? పాల్గొంటే ఎలాంటి ఫలితాలు వచ్చాయి? మీకు కోర్‌ మెకానికల్‌పై ఆసక్తి ఉందా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయడం ఇష్టమా? అన్న ప్రశ్నలు మీకు మీరు వేసుకోవాలి. సరైన జవాబు వచ్చాక ఉద్యోగం చేయాలా లేదా అన్న విషయంపై ఒక నిర్ణయానికి రండి. ఆ తరువాత ప్రయత్నాలు ప్రారంభించండి.

కోర్‌ మెకానికల్ ఉద్యోగాలు చేయాలని అనుకుంటే ఆ కోర్సు సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై మంచి పట్టు ఉండాలి. అలాగే ఈ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అయితే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు గేట్‌ స్కోరును ప్రాతిపదికగా తీసుకొంటున్నారు. ఆసక్తి ఉంటే యూపీఎస్‌సీ (UPSC) నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్ సర్వీస్‌ పరీక్ష రాయండి. అవసరం అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు సంబంధించి కోర్సులు సైతం నేర్చుకోవాలి.

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం - ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ మేలంటున్న నిపుణులు - New Courses Skills For Best Job

Last Updated : Dec 26, 2024, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.