TTD Controversy Latest :వరుస వివాదాలు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా సాగుతున్నాయి. మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆలయ వ్యవహారాలతోపాటుటీటీడీ(TTD) ఈఓపై తీవ్ర విమర్శలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనికి ప్రతిగా ఉద్యోగులు, అర్చకులు మీడియా సమావేశాలు పెట్టి రమణదీక్షితులపై ప్రతి విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. వివాదాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు భిన్నంగా మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
Ramana Dikshitulu Criticism Controversy :ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల వివాదాలకు కేంద్రంగా మారుతోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ యాజమాన్యం తీసుకొంటున్న నిర్ణయాలు శ్రీవారిని సామాన్య భక్తులకు దూరం చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా తిరుమల ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఈఓతోపాటు ఆలయ వ్యవహారాలపై విమర్శలు చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై ప్రధాన అర్చకులు, టీటీడీ ఉద్యోగులు స్పందించడం వంటి వరుస ఘటనలు తిరుమల ఆలయాన్ని వివాదాల్లోకి లాగాయి.
శ్రీవారి భక్తులకు శుభవార్త - మే నెల స్పెషల్ దర్శనం టికెట్లు రిలీజ్!
వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులపై తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రమణదీక్షితులు వీడియోలు వెలుగులోకి వచ్చాక సంజాయిషీ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకునే దిశగా ప్రయత్నాలు చేయలేదు. ప్రధాన అర్చకులు ప్రతి విమర్శలు చేసేందుకు అనుమతించి వివాదాన్ని మరింత జటిలం చేసింది.
"తిరుమల శ్రీవారి ఆలయంలో ఏవో స్తంభాలు తీసుకువచ్చి పెట్టారని, ఏదో తవ్వకాలు జరిగాయని అనేక రకాలుగా రమణదీక్షితులు అంటున్నారు. వారి గుర్తింపు కోసం, వారి ఇతర ప్రయోజనాల కోసం ఇలాంటి అవస్తవాలు దేవాలయం పైన, స్వామివారిపైన చేయడం చాలా బాధాకరం."- వేణుగోపాల దీక్షితులు, ఆలయ ప్రధానార్చకులు