తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల వెళ్తున్నారా? - ఆ దర్శనం రద్దు చేసిన టీటీడీ! - TIRUMALA LATEST UPDATES

జనవరి 7న తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - సిఫార్సు లేఖలు స్వీకరించబోమని వెల్లడించిన టీటీడీ

TTD Cancelled Break Darshan Due To Koil Alwar Thirumanjanam
TTD Cancelled Break Darshan Due To Koil Alwar Thirumanjanam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2024, 5:45 PM IST

TTD Cancelled Break Darshan Due To Koil Alwar Thirumanjanam :తిరుమల శ్రీవారి ఆలయంలో 2025 జనవరి 7వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. దీంతో ఆ రోజు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించింది. ముందురోజు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీడీడీ స్పష్టం చేసింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నేపథ్యంలో జనవరి 7వ తేదీన ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజలు, నైవేద్యాలను సమర్పించనున్నారు. అనంతరం భక్తులను నేరుగా సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు రోజుకు దాదాపు 70 వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతించి దర్శనాలు కల్పించేవిధంగా ప్రణాళిక చేపట్టారు.

శ్రీవాణి దర్శన టికెట్లకు పెరుగుతున్న డిమాండ్ :మరో వైపు తిరుమల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు డిమాండ్​ పెరుగుతోంది. రోజూ తిరుమల గోకులం కార్యాలయంలో 800 కోటా టికెట్లను టీటీడీ జారీచేస్తుండటంతో భారీగా భక్తుల క్యూలైన్ పెరుగుతోంది. గత 10 రోజులుగా మధ్యాహ్నం ఒంటి గంటకే శ్రీవాణి టికెట్ల జారీ ప్రక్రియ పూర్తవుతోంది. రూ.10,500కు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తొంది. సాధారణంగా ఉదయం ఎనిమిదన్నరకు కౌంటర్​లో టికెట్ల జారీ ప్రక్రియ మొదలు పెడతారు.

శ్రీవాణి ట్రస్ట్​ టికెట్ల కోసం ఉదయం 6 గంటల నుంచే భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తుంటారు. అయితే శ్రీవాణి టికెట్లు కావాల్సిన భక్తులు ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ కౌంటరు దగ్గరకు వెళ్లి టికెట్లు పొందాల్సి ఉంది. క్యూలైన్లలోకి చంటి పిల్లలను సైతం తీసుకొని వెళ్లాల్సి రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవాణి దర్శన టికెట్లకు విపరీతంగా ఆదరణ పెరిగి ఒంటి గంట తర్వాత టికెట్లు లేకపోవడంతో భక్తులు నిరాశతో వెనుతిరిగి వెళుతున్నారు.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం - ఆ తేదీనే సర్వదర్శన టికెట్లు జారీ

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - టీటీడీ కీలక ఏర్పాట్లు ఇవే

ABOUT THE AUTHOR

...view details