TSRTC Special Buses for Medaram Jatara 2024 :ములుగు జిల్లా మేడారం భక్తులతో రద్దీగా మారుతోంది. ఇంచుమించు వారంలో అన్ని రోజులూ భక్తులు ఆ వన దేవతల సన్నిధికి వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మలను(Sammakka Saralamma Jatara 2024) దర్శించుకుని బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ బస్సులను నేటి నుంచి ఈ నెల 25 వరకు నడిపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను నడిపిస్తోంది.
ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ(TSRTC) అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గత జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా 1.50 లక్షల మందికి పైగా భక్తులు చేరవేశారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈసారి భక్తులు ఎక్కువగా వస్తారని భావిస్తోంది. ఇప్పటికే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో (TSRTC Special Buses) అధిక సంఖ్యలో మేడారానికి తరలి వస్తున్నారు. దీంతో మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. ప్రభుత్వం మేడారానికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో అతివలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మేడారం జాతర గురించి మంత్రులు పొన్నం, సీతక్కల ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్