తెలంగాణ

telangana

ETV Bharat / state

జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు - బకాయిలు చెల్లించకపోతే ఆర్టీసీ చేతుల్లోకి - RTC notices To JEevanreddy mall

Jeevan Reddy Mall Issue in Armoor : ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌ యాజమాన్యానికి ఆర్టీసీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. బకాయిలపై నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో స్వాధీనం చేసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.

Jeevan Reddy Mall Issue in Armoor
TS Government Notices to Jeevan Reddy Mall in Armoor

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 2:30 PM IST

TSRTC Notices to Jeevan Reddy Mall in Armoor :ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మల్టీప్లెక్స్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అద్దె బకాయల చెల్లింపుపై నోటీసులు ఇచ్చినా జీవన్‌రెడ్డి స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో స్వాధీనం చేసుకునేందుకు వచ్చినట్లు ప్రకటించారు. ఈరోజు (మే 9వ తేదీ 2024) సాయంత్రం వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ గడువు లోగా రూ.3.14కోట్ల బకాయిలు చెల్లించాలని, లేదంటే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. విజిలెన్స్‌ సెక్యూరిటీ కరీంనగర్‌ రీజియన్‌ అధికారి బాబురావు, డిప్యూటీ రీజియన్‌ మేనేజర్ శంకర్‌, డిపో మేనేజర్‌ ఆంజనేయులు ఇతర అధికారులు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాల్​కు వెళ్లి నోటీసులు జారీ చేశారు.

Jeevan Reddy Mall Issue :రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించారు. అందులో మొదట విద్యుత్ అంశంపై చర్చకు రాగా, అందులో ఆర్మూర్‌లోని జీవన్‌ రెడ్డి మాల్‌పై ప్రస్తావన వచ్చింది. ఆర్మూర్‌లోని స్థానిక బస్టాండ్​ను ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7,000 చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఇందులో కొంతకాలం కిందట జీ-1(జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌) పేరిట భవన నిర్మాణం చేపట్టి సినిమా హాళ్లు, దుకాణాలు ఏర్పాటు చేశారు.

అయితే సంవత్సరం ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరటంతో సంస్థ అధికారులు లీజుదారు సంస్థకు నోటీసులు ఇస్తూ వచ్చారు. అయినా ఎంతకూ చెల్లించకపోవడంతో గురువారం హెచ్చరిక ప్రకటన చేశారు. ఆర్టీసీ సిబ్బంది మాల్‌ వద్దకు వెళ్లి మైకులో బహిరంగంగా లీజు బకాయిల వివరాలు వెల్లడించారు. వెంటనే చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు.

Power supply cut to Jeevan Reddy Mall in Armoor : అదేవిధంగా విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.2.5 కోట్ల వరకు ఉండటంతో మాల్​కు గురువారం కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ ఏడీఈ శ్రీధర్‌ ధ్రువీకరించారు. ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నామని, వాయిదాలు కోరడంతో గడువు ఇస్తూ వచ్చామని ఆర్టీసీ, విద్యుత్‌ శాఖ అధికారులు వివరించారు.

జీవన్​రెడ్డి మాల్​కు ఆర్టీసీ నోటీసులు - బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేస్తామని వార్నింగ్

ABOUT THE AUTHOR

...view details