తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎస్‌ఆర్టీసీకి జాతీయస్థాయి అవార్డులు - ఈనెల 15న దిల్లీలో ప్రదానం - TSRTC got National Awards 2024

TSRTC got National Awards : టీఎస్‌ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ఐదు నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు ఆర్టీసీని వరించాయి. 2022-23 ఏడాదిలో రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి.

TSRTC got ASRTU National Awards
TSRTC got National Awards

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 3:31 PM IST

TSRTC got National Awards :తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ఐదు నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు ఆర్టీసీ సంస్థను వరించాయి. 2022-23 ఏడాదిలో రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి.

TSRTC got ASRTU National Awards : రహదారి భద్రతలో ప్రథమ బహుమతి, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్‌ విభాగంలో ప్రథమ బహుమతి, అర్బన్‌ విభాగంలో ద్వితీయ బహుమతిని టీఎస్ఆర్టీసీ కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు మరో ప్రథమ బహుమతిని ఆర్టీసీ సొంతం చేసుకుంది. ఐదు అవార్డులను న్యూఢిల్లీలో ఈ నెల 15న టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఏఎస్‌ఆర్‌టీయూ ప్రకటించింది.

'మహాలక్ష్మి బిల్లులు నెలనెలా చెల్లిస్తాం - రాబోయే రోజుల్లో ఆర్టీసీకి మరో 1000 బస్సులు'

టీఎస్ఆర్టీసీ 5 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయని ఆయన అన్నారు. అవార్డులు వచ్చేలా కృషిచేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను గెలుచుకోవడంతో ప్రజా రవాణా వ్యవస్థలో టీఎస్‌ఆర్టీసీ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌(RTC MD Sajjanar) అన్నారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నమని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువైంది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ పథకానికి ముందు బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) 65-68 శాతం ఉంటే, ఇప్పుడు తరచూ 100 శాతం దాటేస్తోంది. గరిష్ఠంగా 114.28 శాతం ఓఆర్‌ నమోదవ్వడం గమనార్హం. ఇటీవల రాష్ట్రప్రభుత్వం 100 నూతన బస్సులను ప్రారంభించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆర్టీసీలో 100 శాతం దాటుతోన్న ఆక్యుపెన్సీ - రిపేర్ల కోసం షెడ్లకు క్యూ కడుతోన్న బస్సులు

ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా భారీగా పెంపు - ఎంత పెంచారంటే?

ABOUT THE AUTHOR

...view details