1 Died and Few Injured in Van Accident in Adilabad : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఆదివారం ఓ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 46 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే జిల్లా గుడిహత్నూర్ మండలం సూర్యగూడ, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 60 మంది ఆదివారం కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని జంగుబాయి క్షేత్ర దర్శనానికి వ్యాన్‌లో బయలుదేరారు. మార్గంమధ్యలో మాలేపూర్ ఘాట్ వద్ద రహదారి ఏటవాలుగా ఉండడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
ఆగి ఉన్న బస్సును ఢీకొన్న మినీ వ్యాన్- 9 మంది స్పాట్ డెడ్
అక్కడే పెద్ద చెట్టు ఉండటంతో దాన్ని ఢీ కొని ఆగిపోయింది. లేకుంటే భారీ ప్రమాదం సంభవించేదని బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ్యాను బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. స్థానికులు స్పందించి గాయపడ్డ వారిని వెంటనే తొమ్మిది అంబులెన్స్‌ల్లో నార్నూర్, ఉట్నూర్ సీహెచ్‌సీలకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ సూర్యగూడకు చెందిన కుమ్ర మల్కు (61) మరణించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర ప్రమాదం - దంపతులతో పాటు కుమార్తె స్పాట్ డెడ్