తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎస్‌పీఎస్సీ నూతన ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి! - TSPSC New Chairman

TSPSC New Chairman 2024 : టీఎస్‌పీఎస్ కొత్త ఛైర్మన్‌గా మాజీ ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని సమాచారం. సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఛైర్మన్‌ పదవి కోసం 50మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురి పేర్లు తెరపైకి రాగా అందులో మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

TSPSC New Chairman EX DGP Mahendar Reddy
New Chairman For TSPSC

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 10:23 AM IST

TSPSC New Chairman 2024 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డితో ( EX DGP Mahendar Reddy ) పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. ముగ్గురిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

TSPSC New Chairman EX DGP Mahender Reddy :గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ( CM Revanth Reddy) నిర్ణయించారు. దీంతో ఛైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే టీఎస్‌పీఎస్సీ ( TSPSC) అధికారులు రాజీనామా చేయడంతో నూతన సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌ పదవి కోసం 50మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

EX DGP Mahender Reddy As TSPSC Chairman :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి( CS Shanthi Kumari) , న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్‌) కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ సోమవారం రోజున సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది. ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌ రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరిలో మహేందర్‌ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియమాకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు సమాచారం.

TSPSC Paper Leakage : అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం భారీ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ పరీక్షలు నిర్వహించడంలో టీఎస్‌పీఎస్సీ బోర్డు విఫలమైంది. గ్రూప్ పరీక్షల లీకేజీ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్పీ ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై ఇచ్చిన హామీని నెరవేర్చింది. బోర్డు మాజీ అధికారులు రాజీనామా చేయడంతో వారి స్థానాలు భర్తిీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details