తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంట్లో దోషం లేకుండా చేస్తానన్న ట్రాన్స్​జెండర్ - రూ.55 లక్షలు అప్పజెప్పిన అక్కాతమ్ముడు - చివరకు?

ఇంట్లో దోష నివారణ పూజల పేరిట మోసం - రూ.55 లక్షలు టోకరా - చివరకు ఠాణాకు చేరిన పంచాయితీ

Transgender Looted 55 Lakhs Rupees
Transgender Looted 55 Lakhs Rupees (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Transgender Looted 55 Lakhs Rupees :ఇంట్లో దోషం లేకుండా చేస్తానంటూ నమ్మించి కుటుంబ సభ్యుల నుంచి రూ. 55 లక్షలు ఓ ట్రాన్స్ జెండర్ కాజేసిన ఘటన జనగామ జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. జనగామ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ దామోదర్ రెడ్డి కథనం ప్రకారం, జనగామ పట్టణం వెంకన్న కుంటకు చెందిన సిరివెన్నెల అనే మహిళను ఆమె ఇంట్లో దోష నివారణ పూజలు చేస్తానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంకు చెందిన ట్రాన్స్ జెండర్ నాగదేవి నమ్మించారు. ఈ క్రమంలో జులై నెల నుంచి సిరివెన్నెల ఇంటితో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె సోదరుడు నిఖిల్ ఇంట్లో కూడా నాగదేవి దోష నివారణ పూజలు నిర్వహించారు.

ఈ క్రమంలో సిరివెన్నెల ఆమె బ్రదర్ నిఖిల్ పలుమార్లు నాగదేవికి పూజ కోసమని డబ్బులు అందించారు. ఈ విధంగా మొత్తం సొమ్ము రూ.55 లక్షలు ఆమె వారి నుంచి వసూలు చేశారు. నాలుగు నెలలు దాటుతున్నా తమ ఇంట్లో ఎటువంటి మంచి జరగకపోవడంతో అనుమానం వచ్చి నాగదేవిని సిరివెన్నెలతో పాటు ఆమె సోదరుడు నిఖిల్ ఫోన్‌లో నిలదీశారు. ఈ మేరకు ఈనెల 13న జనగామకు వచ్చిన నాగదేవిని సిరివెన్నెల తన డబ్బుల వ్యవహారం కోసం నిలదీయడంతో ఇచ్చిన మొత్తాన్ని ఇవ్వడానికి ఆమె ససేమిరా అంది. దీంతో బాధితులు సిరివెన్నెలతో పాటు నిఖిల్ జనగామ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్​ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దామోదర్ రెడ్డి వివరించారు.

ఇలాంటి 'తెనాలి' గ్యాంగ్ మీ ఇంటికీ రావొచ్చు :మరోవైపు ఇటువంటి ఘటనే హైదరాబాద్​ నగరంలోనూ గత నెలలో చోటుచేసుకుంది. నరదిష్టి పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు, నగలు దోచేస్తున్న ఇద్దరు కిలేడీలను పోలీసులు గుర్తించారు. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా మోసాల పర్వానికి దిగిన ఆ ఇద్దరు మహిళలను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కథనం కోసం ఈ లింక్​ను క్లిక్​ చేసి చదివేయండి.

చిన్న మల్లయ్య పెద్ద ప్లాన్ : ఊరంతా నమ్మితే - ఉన్నదంతా ఊడ్చేసి రూ.2 కోట్లతో జంప్

కలికాలం - ఏకంగా కోటి రూపాయల దేవుడి సొమ్ముతోనే బెట్టింగులు ఆడిన ప్రభుత్వ ఉద్యోగి

ABOUT THE AUTHOR

...view details