ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటెన్షన్​ ఆల్​ - పలు రైళ్ల టైమింగ్​లో మార్పులు - TRAINS TIMINGS CHANGE

దక్షిణ మధ్యరైల్వే పరిధిలోని రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు - జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడి

Trains_Timings_Change
Trains Timings Change (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 8:48 PM IST

Trains Timings Change: దక్షిణ మధ్య రైల్వే (SOUTH CENTRAL RAILWAY) పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ట్రైన్ టైమింగ్స్, నెంబర్ల మార్పుపై సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ మార్పులు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు బెస్ట్ సర్వీసెస్ అందించేందుకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.

దాదాపు 94 రైళ్ల టైమింగ్స్​లో మార్పులు చేసింది. ఇందులో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ సైతం ఉంది. విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే రత్నాచల్ ఎక్స్​ప్రెస్ బయలుదేరుతుంది. పాత షెడ్యూల్‌ ప్రకారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6.15 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్, మార్చిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 6 గంటలకే బయలుదేరనుంది. నిత్యం విజయవాడ నుంచి విశాఖ వెళ్లే ప్రయాణికులు భారీ సంఖ్యలో రత్నాచల్‌ ట్రైన్​లో ప్రయాణిస్తుంటారు. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలంటూ దక్షిణ మధ్య రైల్వే సూచించింది. అదే విధంగా మరిన్ని ట్రైన్లలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.

రైళ్లు నెంబర్లు మార్పు:దక్షిణ మధ్య రైల్వేలో సుమారు 88 రైళ్ల నెంబర్లను సైతం మార్పులు చేశారు. మరికొన్ని రైళ్లకు ఆగే స్టేషన్ల పెంచారు. వీటిని ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లను సెలక్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు 14 ఎక్స్​ప్రెస్ ట్రైన్లు, 21 ప్యాసింజర్ రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్లు ప్రకటనలో తెలిపారు. విజయవాడ మీదుగా కొన్ని కొత్త రైళ్లను సైతం ప్రవేశపెట్టారు.

ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాల్లోనూ మార్పులు:జనవరి 1వ తేదీ నుంచి ఎంఎంటీఎస్‌ (Multi-Modal Transport System) రైళ్ల ప్రయాణ వేళల్లోనూ దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం, కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES), ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​లో మారిన ప్రయాణ వేళలు చూసుకోవచ్చని తెలిపింది.

పర్యాటకులకు పండగే - అరకు సందర్శకులకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు అలర్ట్: ఆ మార్గంలో పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు

ABOUT THE AUTHOR

...view details