Pinnelli Follower Turaka Kishore Arrested: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక దౌర్జన్యాలు, అక్రమాలకు తురకా కిషోర్ పాల్పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. పెద్ద కర్రలతో కారు అద్దాలు బద్దలు కొట్టి దాడికి దిగారు.
దీనిపై కేసు నమోదైంది. అయితే అప్పట్లో పోలీసులు తురకా కిషోర్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన కిషోర్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తురకా కిషోర్‌ను హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
Buddha Venkanna on Turaka Kishore: వైఎస్సార్సీపీ నేత తురకా కిషోర్ లాంటి ఆకు రౌడీలు సమాజానికి హానికరమని, వీడిని ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చిన ఆదేశాలతో తురకా కిషోర్‌ను తమపై దాడికి ఉసిగొల్పారని ధ్వజమెత్తారు. తురకా కిషోర్‌కు ఛైర్మన్ పదవి ఆశ చూపించి తమపైకి దాడికి పంపాడని, తాము తృటిలో తప్పించుకున్నామని నాటి దాడి ఘటనను గుర్తు చేసుకున్నారు.
తాడేపల్లి ప్యాలస్ నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆర్డర్ వచ్చింది.. చైర్మన్ పదవి ఆశ చూపించి పిన్నెల్లి ఈ తురకా కిషోర్ ను మాపైకి వదిలితే ఆనాడు మేము తృటిలో తప్పించుకున్నాము..
— Budda Venkanna (@BuddaVenkanna) January 5, 2025
ఇలాంటి ఆకు రౌడీలు సమాజానికి హానికరం.. వీడిని ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదు! pic.twitter.com/wtTPjPrCb4
"సింగపూర్ వెళ్తానంటున్న పిన్నెల్లి" - బెయిల్ షరతుల సడలింపుపై హైకోర్టులో వాదనలు