Temperature Increasing in Andhra Pradeshఛ ఇంకా శివరాత్రి రానే రాలేదు. కానీ రాష్టంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే సమ్మర్లో ఎండలు ఇంకా ఎలా ఉంటాయోనన్న టెన్షన్లో ప్రజల్లో కనిపిస్తోంది. వేసవి ఆరంభం కంటే ముందే రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీల మేర అదనంగా నమోదు అవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు:
కర్నూలు - 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
నంద్యాల - 35.5 డిగ్రీలు
విజయనగరం - 35.6 డిగ్రీలు
నరసరావుపేట - 35.4 డిగ్రీలు
కడప - 35 డిగ్రీలు
ఏలూరు - 35.3 డిగ్రీలు
తాడేపల్లిగూడెం - 35.2 డిగ్రీలు
రాజంపేట - 35 డిగ్రీలు
గన్నవరం - 31 డిగ్రీలు
నెల్లూరు - 32 డిగ్రీలు
తిరుపతి - 31 డిగ్రీలు
విశాఖ - 30 డిగ్రీలు
మచిలీపట్నం - 31 డిగ్రీలు
అనంతపురం - 34 డిగ్రీలు
ఒంగోలు - 33 డిగ్రీలు
కాకినాడ - 31.2 డిగ్రీలు
కళింగపట్నం - 30 డిగ్రీలు
గుంటూరు - 32.2 డిగ్రీలు
ముందే చుక్కలు: ఏటా మార్చి-ఏప్రిల్‌లో మంట పుట్టించే ఎండలు ఈసారి ముందే చుక్కలు చూపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే, శివరాత్రికి శివ శివ అంటూ చలి సెలవు తీసుకోక ముందే సూర్యుడు చెలరేగి పోతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అసాధారణ వేడి ఉక్కపోతే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భూతాపం కారణంగా ఇప్పటికే గడిచిన 2024 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. మరి 2025 ఏం చేయబోతోందీ అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సారి ఎండలు భారీగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనాలు వేస్తున్నారు.
గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. 2025 కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- 2023లో ఆరు నెలలు, 2024లో ఏడాది పొడవునా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- 1901 నుంచి సేకరిస్తున్న సమాచారం ప్రకారం 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఉష్ణోగ్రత సగటున 0.65 డిగ్రీలు పెరిగింది.
- గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీలు పెరిగింది.
- ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రత సగటున 0.94 డిగ్రీలు పెరిగింది. 1958లో 1.17, 1990లో 0.97 డిగ్రీలు పెరిగాయి. ఆ తర్వాత ఇదే అధికం.
మొదలైన భానుడి భగభగలు - ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు ఎన్‌సీడీసీ మార్గదర్శకాలు పాటించండి : ఈఎస్ఐసీ