Special Trains for Sankranti 2025 : రాష్ట్రంలో అతి పెద్ద పండగ మకర సంక్రాంతి. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో పని చేస్తున్న వారు తప్పకుండా సొంతూళ్లకు చేరుకుంటారు. అయితే, సంక్రాంతి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. పండగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆ స్పెషల్ ట్రైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
![Special Trains for Sankranti 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-01-2025/23260796_trainms.jpg)
సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం జిల్లాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఈనెల 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన తాజాగా విడుదల చేసింది.
రైళ్ల వివరాలు:
ట్రైన్ నెంబర్: 07077- చర్లపల్లి టు తిరుపతి, 6వ తేదీ
ట్రైన్ నెంబర్: 07078-తిరుపతి టు చర్లపల్లి, 7వ తేదీ
ట్రైన్ నెంబర్: 02764-చర్లపల్లి టు తిరుపతి, 8,11,15వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 02763-తిరుపతి టు చర్లపల్లి, 9,12,16వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07037- వికారాబాద్ టు కాకినాడ టౌన్, 13వ తేదీ
ట్రైన్ నెంబర్: 07038- కాకినాడ టౌన్ టు చర్లపల్లి, 14వ తేదీ
ట్రైన్ నెంబర్: 07655- కాచిగూడ టు తిరుపతి, 9, 16వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07656-తిరుపతి టు కాచిగూడ, 10,17వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07035- చర్లపల్లి టు నర్సాపుర్, 11, 18వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07036- నర్సాపుర్ టు చర్లపల్లి, 12,19వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07078- సికింద్రాబాద్ టు కాకినాడ టౌన్, 12,19వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07079-కాకినాడ టౌన్ టు సికింద్రాబాద్, 12,19వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07033-చర్లపల్లి టు నర్సాపుర్, 7, 9, 13, 15, 17వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07034-నర్సాపుర్ టు చర్లపల్లి-8, 10, 14, 16, 18వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07031- చర్లపల్లి టు కాకినాడ టౌన్-8, 10, 12, 14వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07032-కాకినాడ టౌన్ టు చర్లపల్లి- 9, 11, 13, 15వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07487- నాందేడ్ టు కాకినాడ టౌన్- 6, 13వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07488- కాకినాడ టౌన్ టు నాందేడ్- 7,14వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07025-చర్లపల్లి టు శ్రీకాకుళం రోడ్- 9, 12,14వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07026-శ్రీకాకుళం రోడ్ టు చర్లపల్లి-10, 13, 15వ తేదీల్లో
ట్రైన్ నెంబర్: 07041- కాచిగూడ టు శ్రీకాకుళం రోడ్-7వ తేదీ
ట్రైన్ నెంబర్: 07042- శ్రీకాకుళం రోడ్ టు కాచిగూడ-8వ తేదీ