తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనమండలి ఉపఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ - నేడు నాయకులతో సమావేశంకానున్న కేటీఆర్ - KTR On Graduate MLC Election - KTR ON GRADUATE MLC ELECTION

Telangana Graduate MLC BY Election 2024 : తెలంగాణ వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌లు ముగిశాయి. ఇక ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మిగిలింది. ఈ నేప‌థ్యంలో ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ వ్యూహాలు చేస్తుంది. దీనిపై నల్గొండ - వరంగల్ - ఖమ్మం నాయకులతో కేటీఆర్ నేడు సమావేశంకానున్నారు.

KTR Meeting On Graduate MLC BY Election
Telangana Graduate MLC BY Election 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 14, 2024, 9:45 PM IST

Updated : May 15, 2024, 8:18 AM IST

KTR Meeting On Graduate MLC BY Election: శాసనమండలి ఉపఎన్నికపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ బరిలో దింపింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తై ప్రచారపర్వం కొనసాగుతున్న తరుణంలో నియోజకవర్గ పరిధిలోని నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు - Telangana Graduate MLC Elections

BRS Foucus ON MLC Elections :మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించి నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. 2007లో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక వచ్చింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ సవాల్​తో కూడుకొంది. దీంతో ఉపఎన్నికకు సంబంధించిన అన్ని అంశాలపై కేటీఆర్ నేతలతో చర్చించనున్నారు.

BRS Graduate MLC Candidate: ఉన్నత విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్‌రెడ్డి స్వస్థలం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌. బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన నగరంలోని అనేక సమస్యలపై పోరాటాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్​లో చేరారు. పలువురు పేర్లను పరిశీలించిన బీఆర్ఎస్ అధిష్ఠానం విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది.

Telangana Graduates MLC By Elections :ఈ నెల 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. జూన్‌ 5న ఓట్లు లెక్కిస్తారు. అధికారులు వెల్లడించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళా ఓటర్లు 1,74,794, పురుషులు 2,87,007 మంది, ట్రాన్స్‌జెండర్లు ఐదుగురు ఉన్నారు. కాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1,67,853 మంది ఓటర్లు ఉన్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక - బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి - GRADUATE MLC BY POLL BJP CANDIDATE

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి - Telangana Graduate MLC Elections

Last Updated : May 15, 2024, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details