Tollywood Lady Producer Cheating For Money : ఈ మధ్య కాలంలో డబ్బు కోసం మోసాలు పెరిగిపోతున్నాయి. మహిళలు సైతం మోసపూరిత చర్యలకు పాల్పడి పురుషులను డబ్బు కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. ఇటీవల ఓ మహిళ హైవేపై లిప్ట్ అడిగి మార్గమధ్యలో దిగి, డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానంటూ బెదిరించిన ఘటన చూశాం. తాజాగా డబ్బుల కోసం పెళ్లి పేరుతో మోసం(Cheating) చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న ఓ మహిళపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Shilpa Chowdary Cheating Case: చంచల్‌గూడ జైలు నుంచి శిల్పా చౌదరి విడుదల
Tollywood Cheating Case :జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో నివాసముంటున్న నాగార్జున బాబు సినీ పరిశ్రమలో(Film industry) కెమెరా అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అతడికి 'బైరవపురం' సినిమా షూటింగ్ సమయంలో చిత్ర నిర్మాతగా వ్యవహరించిన గుడివాడ ఆశా మల్లికతో పరిచయం ఏర్పడింది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తన ఇంటికి డిన్నర్‌కు రావాలని ఆమె కోరడంతో నాగార్జున బాబు వెళ్లాడు. డిన్నర్ తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత తాను గర్భం దాల్చానని, తనకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని, తన భర్తతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె నమ్మబలికింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా చిలుకూరి బాలాజీ ఆలయం వద్ద పెళ్లి చేసుకున్నాడు.