తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్తీ నెయ్యి మరువకముందే - తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు పేపర్ - tobacco packet in tirumala laddu - TOBACCO PACKET IN TIRUMALA LADDU

Tobacco Paper in Tirupati Laddu Prasadam : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ అయిందనే వార్తలు ప్రస్తుతం ట్రెండ్​గా మారాయి. నెయ్యిలో జంతువుల కొవ్వు కలుపుతున్నారనే విషయం మరువక ముందే ఖమ్మం జిల్లా భక్తురాలికి ఓ ఝలక్​ తగిలింది. అందరికీ పంచుదామని లడ్డూ ప్రసాదం ఓపెన్​ చేయబోతే అందులో పొగాకు కాగితం కనిపించింది. దీంతో మరోసారి లడ్డూ ప్రసాదం విషయం చర్చలోకి రానుంది.d

Tobacco Paper in Tirupati Laddu Prasadam
Tobacco Paper in Tirupati Laddu Prasadam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 5:06 PM IST

Updated : Sep 23, 2024, 5:12 PM IST

Tobacco Packet in Tirupati Laddu Prasadam : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటి అవశేషాలు కలిపినట్లు రిపోర్టులో తేలింది. ఈ విషయంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్​గా తీసుకుంది. హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యితో చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మరోవైపు తిరుపతి లడ్డూ కల్తీపై ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వివిధ పీఠాధిపతులు, సామాన్యులు తీవ్రంగానే స్పందించారు. దేవుడితో ఆటలేంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ గొడవ నడుస్తున్న క్రమంలో తాజాగా ఖమ్మంలో ఓ భక్తుడికి చేదు అనుభవం ఎదురైంది. లడ్డూ ప్రసాదంలో పొగ ముక్కలు, పొగాకు పొట్లం రావడంతో ఒక్కసారిగా అవాక్కు అయ్యారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న వార్తలు తెలిసిన తర్వాత మళ్లీ ఇలాంటి జరగడం అపవిత్రమేనని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం హట్​టాఫిక్​గా మారుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లాలోని గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్​షిప్​లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. పద్మావతి అనే మహిళ వారి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు బంధువులకు, ఇరుగుపొరుగు వారికి పంచెేందుకు లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. మరుసటి రోజు లడ్డూని పంచేందుకు చూడగా అందులో పేపర్లు మలిచిపెట్టిన పొగ ముక్కలు దర్శనమిచ్చాయి. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో ఇలాంటివి రావడం చాలా బాధగా ఉందని భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడినట్లు ల్యాబ్​ రిపోర్ట్స్​లో వెలుగు చూశాయి. దీంతో లడ్డూ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విషయం మరోసారి తేటతెల్లమైందని భక్తులు మండిపడుతున్నారు. అసలు లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఏంటని శ్రీవారి భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి చర్యల వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారు అవుతున్నారని వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

తిరుమల లడ్డూ విషయంలో డౌట్ వద్దు - అంతకంటే ముందే నెయ్యి మార్చేశాం : టీటీడీ - TTD ON TIRUMALA LADDU controversy

లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి - ప్రాయశ్చిత్తంగా తిరుమలలో శాంతి హోమం - Maha Shanti Homam in Tirumala

Last Updated : Sep 23, 2024, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details