Three died in Road Accident in Sangareddy District :సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం రామ్‌సాన్‌పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు, కుమారుడు ముగ్గురు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు రహదారి పక్కనున్న రక్షణ గోడకు ఢీకొట్టారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులు మద్నూర్ మండలం, పెద్ద తాడ్కుర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(35), సునీత((30), నాగేశ్గా (07) పోలీసులు గుర్తించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పుత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులు, కుమారుడు మృతి - Road Accident - ROAD ACCIDENT
Accident in Sangareddy District : సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం రామ్‌సాన్‌పల్లి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు, కుమారుడుతో సహా ముగ్గురు మృతిచెందారు.
Accident in Sangareddy District (ETV Bharat)
Published : May 17, 2024, 7:47 PM IST