Threats with Videos : 'నీ అశ్లీల వీడియోలు నా వద్ద ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే వాటిని ఇంటర్ నెట్‌లో పెడతా' అంటూ ఓ యువతిని బెదిరించి రూ.2.53 కోట్లు కాజేసిన నిందితుడిని నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో ప్రైవేటు హస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అదే హాస్టల్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు కాజా అనూష దేవి కలిసింది.
గొంతు మార్చి ఫోన్లో బెదిరింపులు : కాజా అనూష దేవి నినావత్ దేవనాయక్ అలియాస్ మధు సాయికుమార్‌ను తన భర్త అంటూ యువతికి పరిచయం చేసింది. దేవనాయక్ ప్రణాళిక ప్రకారం గొంతు మార్చి ఆ యువతికి ఫోన్ చేసి నీ నగ్న వీడియోలు నా వద్ద ఉన్నాయి. వాటిని ఆన్లైన్లో అప్‌లోడ్ చేయకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. అనంతరం వేరొకరి సహాయంతో ఆ సమస్యను దేవనాయక్ పరిష్కరించినట్లు చెప్పి ఆ యువతి వద్ద డబ్బు తీసుకున్నాడు.