తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ లగ్జరీ దొంగ లైఫ్‌ స్టైలే వేరు : విమానాల్లో ప్రయాణం - స్టార్ హోటల్లో విడిది - చేసేది మాత్రం? - THEFT FOUND TIRUPATI

చోరీలకు పాల్పడుతూ జల్సాలు - స్టార్‌ హెటల్స్‌లో బస చేస్తూ రెక్కీ నిర్వహించి దోపిడీలు - ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు

Theft Found Tirupati
Theft Found Tirupati (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 10:07 AM IST

Theft Found Tirupati :చోరీ డబ్బులతో విమానాల్లో ప్రయాణిస్తాడు. స్టార్‌ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతాడు. 16 ఏళ్లకే దొంగతనాలు మొదలుపెట్టి అంతర్రాష్ట్ర స్థాయిలో 18 కేసుల్లో నిందితుడైన విలాసాల దొంగను తిరుపతి క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో అడిషనల్‌ ఎస్పీ నాగభూషణరావు, డీఎస్పీ రమణకుమార్‌లు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 15న మధ్యాహ్నం తిరుపతి ఎయిర్ బైపాస్‌ రోడ్డులో తాళం వేసి ఉన్న వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ కార్యాలయంలో ఓ వ్యక్తి చొరబడి క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న రూ.8 లక్షలు దోచుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ ప్రకాష్‌ కుమార్‌, చిన్న పెద్దయ్య, ఎస్‌ఐ శుభన్‌ నాయక్‌తో పాటు సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టగా ఈ నెల 22న శ్రీసాయి నిర్మలా కల్యాణ మండపం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని సోమరాజపల్లికి చెందిన గురువిళ్ల అప్పల నాయుడు (29)ను అదుపులోకి తీసుకున్నారు. రూ.6 లక్షల నగదు, స్క్రూ డ్రైవర్‌ స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గుడితి గ్రామానికి చెందిన అప్పలనాయుడు ప్రకాశం జిల్లాలో స్థిరపడ్డారు. వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ఆఫీస్‌లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. సింగరాయకొండ, ఒంగోలు, కందుకూరు, టంగుటూరు, విశాఖపట్నం, అరిలోవ, మువ్వరాణిపాళెం, గాజువాక, ద్వారక పోలీస్‌ స్టేషన్‌తో పాటు తెలంగాణలోని ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయి.

షాపు యజమాని బంగారం శుద్ధి చేయమని పంపిస్తే - గుమాస్తా ఏం చేశాడో తెలుసా?

హోటల్లో రెక్కి నిర్వహించి దోచేస్తాడు :నిందితుడు దొంగతనాలకు ఎలా పాల్పడుతాడు అంటే, గ్లాస్‌ డోర్ అన్న దుకాణాల ముందు రెక్కీ నిర్వహిస్తాడు. మధ్యాహ్నం భోజన సమయంలో యజమానులు దుకాణాలు మూసి వెళ్లగానే నకిలీ తాళాలు, స్క్రూడ్రైవర్‌ సహాయంతో వాటిని తెరచి ఉన్నదంతా దోచుకోనిపోతాడు. ఇలా విశాఖలోని అరిలోవ పీఎస్‌ పరిధిలో చేసిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఈ నెల 11న బయటకు వచ్చాడు. అక్కడి నుంచి విమానంలో తిరుపతికి వచ్చి తిరుచానూరు రోడ్డులోని స్టార్‌ హోటల్‌లో బస చేసి, నాలుగు రోజులు రెక్కీ నిర్వహించి 15వ తేదీ చోరీకి పాల్పడ్డాడు. వారం రోజుల్లో రూ. రెండు లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బ్యాంక్​ లాకర్​లో బంగారం దాచిపెడుతున్నారా? అయితే ఆర్​బీఐ రూల్స్​ ఇవే

'మన యజమానులపైనే చాలా కేసులున్నాయి - మనం ఇల్లంతా దోచేసినా స్టేషన్​కెళ్లి కంప్లైంట్ ఇవ్వరు'

ABOUT THE AUTHOR

...view details