The Declining Joint Family System in Telangana : 'ఎట్లుండే ఊరు, ఎట్లయ్యిందో చూడు. అన్నదమ్ములోలె ఉండేటోళ్లం, అడ్డుగోడలతో ప్రేమకు దూరమాయే. బంగారు బంధుత్వం మాయమాయే. డబ్బు బంధాలే మిగిలి, మనుషులే దూరమాయే' అని ఓ కవి చెప్పినట్లు బంధాలు, అనుబంధాలు ఆత్మీయతలు కనుమరుగవుతున్నాయి. బలగం బలం తగ్గిపోతుంది. కుటుంబ వ్యవస్థ కూలిపోతోంది.
కథలుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు :ప్రస్తుత తీరు ఇలాగే కొనసాగితే పల్లెల్లో ఓ ఉమ్మడి కుటుంబం, వారి కట్టుబాట్ల గురించి, అప్పట్లో అలా ఉండేది అని కథలుగా చెప్పుకొనే పరిస్థితి రావొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పట్లో ఆనాటి పెద్దనే మ్యారేజీ బ్యూరోల్లా పెళ్లి సంబంధాలు కుదిర్చేవారు. ఆ బంధాలు కుటుంబ వ్యవస్థ పటిష్ఠతకు చేయూతనిచ్చేలా కష్ట, సుఖాలను సంయమనంతో పంచుకునేవి. కానీ ప్రస్తుతం ఒకరినొకరు అర్థం చేసుకుని మెదిలే రోజులు పోతున్నాయి. అప్యాయతలకు బదులు ఈర్శ్య భావాలకు బలమేర్పడుతోంది.
అతిపెద్ద కుటుంబం.. ఒకటిన్నర ఎకరంలో ఇల్లు.. 62 మందికి ఒకే కిచెన్!
వచ్చిన కోడలిని కుమార్తెలా, ఆమె సైతం అత్తవారింటిని పుట్టినిల్లుగా చూడాలి. ఒకరి మాటను మరొకరు గౌరవిస్తేనే గొడవలకు తావుండదు. రోజూ లోపాలు సరిదిద్దుకుంటే ఆ కుటుంబం కలహాలు లేని కాపురంగా సాగుతుంది. చిన్న విషయాలకే కుటుంబం నుంచి విడిపోవాలనే ఆలోచనలు రావడం అన్నింటికి ముఖ్య కారణం. సర్దుకొని పోవడం అన్న తీరే ఇప్పటి కాలంలో లేకుండా పోయింది. అన్నది, చేసింది మనవాళ్లే అనే ఆలోచనే ఉండటం లేదు.
ముఖ్యకారణాలు ఇవేనట :
- చిన్న తప్పైనా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవడం.
- ఎదురుగా మనుషులు ఉన్నా టీవీ, ఫోన్లు, ఇతర ఆన్లైన్లో మునిగిపోవడం.
- చిన్న విషయాలకు అలిగి, అయిన వారిని దూరం పెట్టడం.
- ఎవరో ఒకరి నోటి దురుసుతనం, కోపంతో కుటుంబమంతా చెదిరిపోవడం.
- ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం.
- మనిషికి మరో మనిషంటే గిట్టనితనం, తమదే పెత్తనం అని ఉండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం.
- మధ్యవర్తిత్వం చేసేవారు లేక ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ఉండటం.
- కుటుంబ నిర్వహణ అనేది గొప్ప అది తెలియకపోవడం.
- సోషల్ మీడియాలో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది డ్రామా అన్నట్లు ప్రవర్తించడం.
- ఎవరైనా మరణిస్తే ఒక మెసేజ్‌తో చేతులు దులుపుకొంటున్నారు. వారింటికెళ్లి పలకరించడం లేదు.
38 మంది సభ్యుల 'ఆర్మీ ఫ్యామిలీ'.. తరతరాలుగా దేశ సేవలోనే...
తండ్రి ఆలోచన అదిరింది.. పిల్లల కోరిక నెరవేరింది!