తెలంగాణ

telangana

ETV Bharat / state

TSSPDCL యాప్​ - కరెంట్ బిల్లు పేమెంట్సే కాదు - ఈ అప్లికేషన్​తో ఎన్ని లాభాలో తెలుసా? - TSSPDCL MOBILE APP PAY CURRENT BILL - TSSPDCL MOBILE APP PAY CURRENT BILL

TGSPDCL Mobile App : ఇప్పుడు విద్యుత్​ బిల్లులు చెల్లించేందుకు థర్డ్​ పార్టీ యాప్​లను కాకుండా విద్యుత్​ పంపిణీ సంస్థ యాప్​ (TGSPDCL)ను వినియోగదారులు వినియోగిస్తున్నారు. ఈ యాప్​ ద్వారానే కరెంటు బిల్లును కడుతున్నారు. అయితే కరెంటు బిల్లు కట్టడమే కాదు ఈ యాప్​ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలని ఉందా?

TGSPDCL Mobile App
TGSPDCL Mobile App (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 12:24 PM IST

Updated : Jul 7, 2024, 12:30 PM IST

TGSPDCL Mobile App to Pay Electricity Bill :థర్డ్​ పార్టీ యాప్​లతో కరెంటు బిల్లులు చెల్లించవద్దని ఆర్​బీఐ గైడ్​లైన్స్​ పాస్​ చేసిన విషయం తెలిసిందే. మరి ఎలా కరెంటు బిల్లు కట్టాలని వినియోగదారుడు అనుకున్నాడు. ఈ స్థితిలో విద్యుత్​ పంపిణీ సంస్థనే ఓ యాప్​ను వినియోగంలోకి తెచ్చింది. ఇప్పుడు ఆ యాప్​ను ఎక్కువ మంది వినియోగదారులు డౌన్​లోడ్​ చేసుకొని దాని ద్వారా బిల్లు పేమెంట్​ చేస్తున్నారు. అదే​ టీజీఎస్పీడీసీఎల్ మొబైల్​ యాప్. ​ప్రస్తుతం విద్యుత్​ కరెంటు బిల్లు చెల్లించేందుకు సంబంధించి ఈ యాప్​ ఫేమస్​ అవుతుంది. ఎందుకంటే ఈ నెల శనివారం నాటికి 1.92 లక్షల మంది డౌన్​లోడ్​ చేసుకున్నారు.

కేవలం శనివారం ఒక్కరోజే 70 వేల మంది టీజీఎస్పీడీసీఎల్​ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు. యాప్​తో బిల్లుల చెల్లింపులు మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు ఉన్నాయని విద్యుత్​ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కరెంటు బిల్లు చెల్లింపులో ఈ యాప్​ను ఉపయోగిస్తూ వినియోగదారుడు సంతృప్తి చెందుతున్నాడు.

80 శాతం మంది ఆన్​లైన్​లో బిల్లుల చెల్లింపు : గతంలో గూగుల్​ పే, ఫోన్​ పే, పేటీఎం, బిల్​ డెస్క్​ వంటి థర్డ్​ పార్టీ పేమెంట్​ యాప్స్​ ద్వారా నగరంలో దాదాపు 80 శాతం మంది ఆన్​లైన్​లోనే విద్యుత్​ బిల్లులను చెల్లించేవారు. ఎందుకంటే వీటికి ఎలాంటి యూజర్​ ఛార్జీలు అనేవి చెల్లించేవారు. అందుకే అత్యధిక మంది యూపీఐ చెల్లింపుల వైపే మొగ్గు చూపారు. అయితే వీటిలో కొన్ని ఆర్​బీఐ నిబంధనల మేరకు భారత్​ బిల్​ పేమెంట్​ సిస్టమ్​తో ఎనేబుల్​ చేసుకోలేదు.

అందుకే ఆ థర్డ్​ పార్టీ యాప్​లలో నేరుగా విద్యుత్​ బిల్లులు చెల్లించవద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థ తెలిపింది. అయితే బిల్లుల చెల్లించేందుకు విద్యుత్​ సంస్థ వెబ్​సైట్​, యాప్​లో లేదా వీటిని కన్పించే థర్డ్​పార్టీ యాప్​లలోనూ చెల్లించవచ్చని ఇటీవల సూచించింది. దీంతో ఆ యాప్​లకు దిమ్మతిరిగేలా ఐదు రోజులుగా డిస్కం యాప్​లను పెద్ద సంఖ్యలో ఉపయోగించడం వినియోగదారులు ప్రారంభించారు. దీని ద్వారా శనివారం వరకు 2.5 లక్షల మంది కరెంటు బిల్లులు చెల్లించారని అధికారులు వివరించారు.

విద్యుత్​ సంస్థ యాప్​ వల్ల కలిగే ఉపయోగాలు :

  • యాప్​ మొబైల్​లో ఉండటం ద్వారా విద్యుత్​ అంతరాయాలపై ఫిర్యాదు చేయవచ్చు.
  • అలాగే వోల్టేజీ హెచ్చుతగ్గులపై ఫిర్యాదు చేయవచ్చు.
  • విద్యుత్​కు సంబంధించిన ఇతర సమస్యలైనా డిస్కం దృష్టికి తీసుకువెళ్లవచ్చు.
  • మీటర్‌ కాలిపోవడం, బిల్లింగ్‌లో తప్పులపై ఫిర్యాదు చేయవచ్చు.
  • గత బిల్లుల వివరాలు చూసుకోవచ్చు.
  • ఇంట్లో ఇప్పుడు వినియోగిస్తున్న లోడ్‌ను పెంచుకోవడానికి కరెంట్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదు. యాప్‌ నుంచే నిర్ధారిత మొత్తం చెల్లిస్తే సరిపోతుంది.
  • టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌ సహా, కొత్త కనెక్షన్‌ వరకు యాప్‌ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశించిన పని దినాల్లో సేవలు పొందవచ్చు.

ఒక్క క్లిక్​తో కరెంట్ బిల్లు కట్టేయొచ్చు - ఈ QR కోడ్​ విధానం మీకోసమే? - CURRENT BILL PAYMENT WITH QR CODE

G-pay, Phonepe కట్ - వెబ్​సైట్ & యాప్ ద్వారా కరెంట్ బిల్లు ఎలా కట్టాలో మీకు తెలుసా ? - How To Pay current Bill On TGSPDCL

Last Updated : Jul 7, 2024, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details