తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్ - 2 పరీక్షలు డిసెంబర్​కు వాయిదా - త్వరలోనే కొత్త తేదీల ప్రకటన - TSGPSC Group 2 Exam Postponed

TGPSC Group 2 Postponed : గ్రూపు 2 అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. గ్రూప్​ 2 పరీక్షలు డిసెంబరుకు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్​ 2 పరీక్షలను వాయిదా వేస్తూ టీజీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్​ 2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.

TGPSC Group 2 Postponed
TGPSC Group 2 Postponed (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 4:46 PM IST

Updated : Jul 19, 2024, 7:35 PM IST

Telangana Group 2 Exam 2024 Postponed :గ్రూప్​ 2 పరీక్షలు డిసెంబర్​కు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్​ 2 పరీక్షలను వాయిదా వేస్తూ టీజీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్​ 2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. గ్రూప్​ 2 అభ్యర్థులతో సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్​, గ్రూప్​ 2 అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్​ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రూప్​ 2ను వాయిదా వేసింది.

గ్రూప్​ 2,3 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించిందని అభ్యర్థులు తెలిపారు. డిసెంబరులో గ్రూప్​ 2 పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించిందని వారు స్పష్టం చేశారు. అలాగే గ్రూప్​ 2 పోస్టుల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ ఛైర్మన్​ మహేందర్​ రెడ్డికి భట్టి విక్రమార్క ఫోన్​ చేసి గ్రూప్​ 2 వాయిదా వేయాలని ఆదేశించారు.

త్వరలో కొత్త తేదీలు : పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ మల్లు రవి స్పష్టంగా చెప్పారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో తేదీలు ప్రకటించనుందని వెల్లడించారు. గ్రూప్​ 2 అభ్యర్థులతో సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్​, గ్రూప్​ 2 అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్​ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు.

"గ్రూప్​ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది. పరీక్షల నిర్వహణపై త్వరలో తేదీలు ప్రకటించనుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యర్థులకు విలువైన సమాచారం ఇచ్చారు. - మల్లు రవి, ఎంపీ

గ్రూప్​ 2 అభ్యర్థులతో చర్చల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, "గ్రూప్​ 2 పరీక్ష వాయిదాను పరిశీలించాలని టీజీపీఎస్సీకి ఛైర్మన్​ను ఆదేశించాం. డిసెంబరులో గ్రూప్​ 2 నిర్వహణపై పరిశీలించాలి. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబరులో నిర్వహణపై పరిశీలిస్తాం. మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించాం. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్​ క్యాలెండర్​ను ప్రకటిస్తాం. ఓవర్​ లాపింగ్​ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. గత ప్రభుత్వం మొదటి పదేళ్లలో ఉద్యోగాల భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవి." అని ఆయన తెలిపారు.

మా బిడ్డలు ఆర్థికంగా స్థిరపడాలి : సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే తమ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి ఒకే మాట చెప్పారు తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుందని, కానీ తాము అలా ఆలోచించడం లేదన్నారు. మా బిడ్డలు స్థిరపడాలి వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

గ్రూప్​ 2 అభ్యర్థుల అభ్యర్థన :డీఎస్సీ, గ్రూప్​ 2 పరీక్షకు మధ్య సమయం కేవలం 2 వారాలే ఉండటంతో గ్రూప్​ 2ను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్చి నెలలోనే ఆగస్టు 7,8 తేదీల్లో 783 పోస్టులకు గ్రూప్​ 2 పరీక్ష నిర్వహించేందుకు సన్నాహకాలు చేసింది. ఈ క్రమంలో వాయిదా వేయాలని అభ్యర్థులు అభ్యర్థించారు. ఈ గ్రూప్​ 2 పరీక్షకు 5.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

గ్రూప్‌ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి - TGPSC Group1 Prelims Results 2024

చిక్కడపల్లి సెంట్రల్​ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత - నిరుద్యోగులను అరెస్ట్​ చేసిన పోలీసులు - Unemployed Protest in Chikkadapally

Last Updated : Jul 19, 2024, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details