TG TET 2024 Hall Tickets :తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024 -2 హాల్ టికెట్ల విడుదలయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ హాల్టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ పరీక్షలు ఆన్లైన్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్టులు) నిర్వహించారు. పరీక్షలను పేపర్-1, పేపర్-2 రూపంలో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ తేదీల్లో పరీక్షలు : జనవరి 8,9,10,18 తేదీల్లో టెట్ పేపర్ -1 పరీక్ష ; జనవరి 2,5,11,12,19,20 తేదీల్లో పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించాల్సిందే. అర్హత సాధించకపోతే మరి నియామకం లేనట్లే. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(TRT) రాయడానికి అర్హులు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెట్ -1 పరీక్షను నిర్వహించి అందులో అర్హత పొందిన అభ్యర్థులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించి నియామకాలను చేపట్టింది. ఇప్పుడు మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవడంతో టెట్-2ను నిర్వహిస్తోంది. సరైన ప్రణాళికా ప్రకారం చదివితే టెట్లో మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎక్కువ మార్కులు సాధిస్తే డీఎస్సీ పరీక్షలో మెరిట్ లభిస్తోంది. దీంతో అందరి కంటే ముందు వరుసలో జాబ్ కోసం మీరు ఉంటారని తెలుపుతున్నారు. సబ్జెట్స్పై పట్టు సాధిస్తే ఇంకా మంచిదని అంటున్నారు.