ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్పంచులపై పోలీసుల జులం - అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత

Tension Situation in Sarpanches Protest: సర్పంచుల నిరసన అసెంబ్లీని తాకింది. సర్పంచ్‌ల ఆందోళనతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ముట్టడికి సర్పంచులు యత్నించడంతో పోలీసులు జలుం ప్రదర్శించారు. లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. సర్పంచ్​లను బలవంతంగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Sarpanches_Protest
Sarpanches_Protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 10:54 AM IST

సర్పంచులపై పోలీసుల జులం - అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత

Tension Situation in Sarpanches Protest: అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచుల నిరసన అసెంబ్లీని తాకింది. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ వచ్చి అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించారు. కొందరు సర్పంచులను తమ కార్లలో తీసుకొచ్చి వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట విడిచిపెట్టారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల కార్లు తనిఖీ చేయకపోవడంతో అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచులు రాగలిగారు.

మరికొందరు సర్పంచ్​లు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్లలో వచ్చారు. అసెంబ్లీకి వెళ్లే మార్గం వద్ద పోలీసులు సర్పంచులను అడ్డుకున్నారు. ఆర్థికసంఘం నిధులు ప్రభుత్వం దారి మళ్లించిందంటూ సర్పంచ్​లు ఆందోళన చేపట్టారు. దారిమళ్లించిన నిధులు సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను సర్పంచుల అధీనంలోకి తేవాలని ఆందోళన చేపట్టారు.

మహిళా సర్పంచుల పట్ల విచక్షణా రహితంగా దాడి: ఉపాధి హామీ నిధులను చట్టప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లు పరీష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచుల నినాదాలు చేపట్టారు. దీంతో పోలీసులు సర్పంచ్ లు ఈడ్చిపడేశారు. సర్పంచ్ లను బూటు కాళ్లతో తన్నుతూ లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు.

పలువురు సర్పంచులకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళా సర్పంచ్​ల పట్ల మగ పోలీసులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్​లను బలవంతంగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దారిమళ్లించిన నిధులను అడుగుతుంటే తమను అణిచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నిధుల కోసం సర్పంచుల ఛలో అసెంబ్లీ- పలువురిని గృహ నిర్బంధం

పోలీసుల జులం: అసెంబ్లీ వద్ద సర్పంచుల పట్ల పోలీసులు జులం ప్రదర్శించారు. పోలీసుల కాళ్ల పైపడి మరీ తమ హక్కుల్ని కాపాడాలని సర్పంచులు వేడుకున్నారు. బూటు కాళ్లతోనే సర్పంచులను నెట్టి వేస్తూ సర్పంచుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. మహిళా సర్పంచులను సైతం నిర్ధాక్షణరహితంగా ఈడ్చివేశారు.

పోలీసుల దాడిలో తీవ్ర గాయాలు: పోలీసుల దాడిలో సర్పంచల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం దారిమళ్లించిందంటూ ఆందోళన చేపట్టారు. దారి మళ్లించిన నిధులు సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను సర్పంచుల అధీనంలోకి తేవాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

"సర్పంచుల నిధులను దొంగతనం చేశారు. మాకు న్యాయం చేయాలి. కేంద్ర ఇచ్చిన నిధులను మాకు విడుదల చేయాలి. మా నిధులు మాకు ఇవ్వమని పోరాడటానికి వచ్చాము. నాలుగు సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఇదే ఆఖరి పోరాటంగా ఇక్కడికి వచ్చాము". - సర్పంచులు

'హరిలో రంగ హరి పంచాయతీ నిధులు హరీ' - హరిదాసు వేషధారణలో సర్పంచ్ భిక్షాటన

ABOUT THE AUTHOR

...view details