APSPDCL MD Santosh Rao Meet Minister Gottipati : నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లుల చెల్లింపులు, మీడియా కథనాలపై ఏపీఎస్పీడీసీఎల్(APSPDCL) ఎండీ సంతోషరావుని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరణ కోరారు. మీడియాలో వరుస కథనాలపై ముఖ్యమంత్రికి ఉన్న అసంతృప్తిని మంత్రి గొట్టిపాటి ఎండీ సంతోషరావు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కాకుండా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని మంత్రి ఎస్పీడీసీఎల్ ఎండీకి స్పష్టం చేశారు. విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ని ఎస్పీడీసీఎల్ ఎండి సంతోష్ రావు అమరావతిలో కలిశారు. గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు తగ్గాలని మంత్రి ఆదేశించారు. అలాగే వేసివిలో విద్యుత్ కోతలు ఉండరాదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ హామీ మేరకు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
Smart Meters: ప్రజలపై అదానీ స్మార్ట్ షాక్.. మీటర్ల ఏర్పాటు, నిర్వహణల పేరిట రూ.29వేల కోట్ల భారం
స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ప్రభుత్వం మొండి వైఖరి - రైతులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా కనెక్షన్లు