CM Chandrababu Review on Tourism Department: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారును ఆదేశించారు. సచివాలయంలో పర్యాటక శాఖపై సీఎం సమీక్ష చేపట్టారు. సమావేశానికి ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్, అధికారులు హాజరయ్యారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రణాళికలపై సీఎం చర్చించారు. వివిధ ప్రాంతాల్లో హోటల్ గదుల నిర్మాణం, పీపీపీ ప్రాతిపదికన ప్రాజెక్టులు చేపట్టే అంశంపై సీఎం సమీక్షించారు. కేంద్ర పథకాలను సమన్వయం చేసుకుని రాష్ట్రంలో టూరిజం సర్క్యుట్లను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు ఆదేశించారు.
పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధిరేటు ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ ప్రాజెక్టులు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో హోమ్ స్టేల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యాటకులకు మండువా లోగిళ్లు అందుబాటులోకి తేవాలని అలానే సీ ప్లేన్, హెలీ టూరిజం ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. తిరుపతి, విశాఖ, అమరావతి, శ్రీశైలం, రాజమహేంద్రవరంలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక పరిణామం - 35 మంది బెయిల్ పిటిషన్ల కొట్టివేత
దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్, క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో టూరిజం ఐల్యాండ్‌ల అభివృద్ధికి నిర్ణయించినట్లు వెల్లడించారు. పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు ఏర్పాటు చేయాలని ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అరకు, లంబసింగి, గండికోట, సూర్యలంక, రాజమండ్రి, బ్రిడ్జిలంకలో రాణ్ ఆఫ్ కచ్ తరహాలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చేనేత హస్తకళలతో పాటు అరకు కాఫీకి ప్రాచుర్యం కల్పించేలా కెఫేల ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఉన్న శిల్పారామాల్లో ఆడిటోరియంలు నిర్మించాలని ఆదేశించారు.
రాజధాని సమీపంలోని ఉండవల్లి, సీతానగరం, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని కొండలపై ట్రెక్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుపతిని చైన్ ఆఫ్ ట్యాంక్‌గా, వైజాగ్‌ను సిటీ ఆఫ్ బీచెస్గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కేంద్ర సహకారంతో చేపట్టే అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ బుక్‌ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
బర్డ్ ఫ్లూపై దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి అచ్చెన్న
పర్యాటకులకు గుడ్‌న్యూస్- ఇకపై చెన్నై టూ విశాఖకు నౌకలో ప్రయాణించొచ్చు