Police Arrested Vallabhaneni Vamsi: నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్‌లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు. వంశీ ఇంటి వద్ద కూడా వాటిని అతికించారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును ఏ మాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసును సీఐడీకి అప్పగించారు.
ఈ ఘటనకు సంబంధించి 94 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ 71వ నిందితునిగా ఉన్నారు. సీఐడీ ఇంత వరకు 40 మందిని అరెస్టు చేసింది. ఫిర్యాదుదారు సత్యవర్ధన్ రెండు రోజుల కిందట కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు విజయవాడ కోర్టులో అఫిడవిట్ వేశారు. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు సత్యవర్ధన్ హాజరై తనకు కేసుతో సంబంధం లేదని అఫిడవిట్ సమర్పించారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ నిర్ణయించినట్లు అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
వంశీ కదలికలపై నిఘా: సత్యవర్ధన్‌ను అపహరించారని అతనికి ప్రాణభయం ఉందంటూ సత్యవర్ధన్ సోదరుడు కిరణ్, గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు మేడేపల్లి రమా పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కొన్ని ఆధారాలను సేకరించిన పటమట డీసీపీ కృష్ణ, అడిషినల్ డీసీపీ రామకృష్ణ నేతృత్వంలోని బృందం వంశీ కదలికలపై నిఘా ఉంచింది. హైదరాబాద్‌కి వెళ్లి రాయదుర్గంలోని అపార్ట్‌మెంట్‌లో ఉన్న సమయంలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు.
వంశీని విజయవాడకు తీసుకొస్తున్న సమయంలో ఏపీ సరిహద్దుల్లో వాహనం మార్చారు. చిల్లకల్లు టోల్‌గేట్ వద్ద జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. వంశీని విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు తొలుత భవానీపురం స్టేషన్‌లో కాసేపు ఉంచారు. అక్కడి నుంచి మధ్యాహ్నం కృష్ణలంక స్టేషన్‌కు తరలించారు. మార్గమధ్యలో వంశీ పలుమార్లు పోలీసులపై ఆగ్రహం ప్రదర్శించారు. వంశీపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అతని వాంగ్మాలాన్ని పోలీసులు నమోదు చేశారు.
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక పరిణామం - 31 మంది బెయిల్ పిటిషన్ల కొట్టివేత
నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు: ముందుగా హైదరాబాద్ రాయదుర్గం సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో వంశీ ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వంశీ ఉండే ప్లాట్‌లోకి వెళ్లి అరెస్ట్ విషయాన్ని ఆయనకు తెలియజేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ కొద్దిసేపు పోలీసులతో ఆయన వాదనకు దిగారు. గన్నవరం కేసులో కోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్న విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యాలయంపై దాడి కేసులో కాదు ఎస్సీ, ఎస్టీ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ అరెస్టు వారెంట్ చూపారు.
గన్నవరం తెలుగుదేశం కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్‌ను బెదిరించిన విషయంలో కేసు నమోదైందని తమతో రావాలంటూ వంశీకి పోలీసులు స్పష్టం చేశారు. డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పడంతో పోలీసులు అంగీకరించారు. కానీ చాలా సేపటి వరకు వంశీ బయటకు రాకుండా అరెస్టు సమాచారాన్ని కొందరు వైఎస్సార్సీపీ నాయకులు, తన అనుచరులకు చేరవేశారు. దాదాపు గంట సేపు బెడ్ రూమ్ నుంచి వంశీ బయటకు రాకుండా పోలీసులను నిరీక్షించేలా చేశారు. వంశీ అరెస్టు సమాచారాన్ని ఏపీ పోలీసులు ముందస్తుగానే రాయదుర్గం స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వంశీపై ఉన్న కేసు వివరాలను రాయదుర్గం పోలీసులకు తెలిపారు.
మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా : వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏ2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం చేసిన కేసు నమోదై ఉంది. గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. టీడీపీ నేత కాసరనేని రంగబాబుపై దాడి కేసులో ఇప్పటికే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు మరికొందరు ఉన్నారు. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చింది. 2019లో ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్లపట్టాలు ఇచ్చారనే అంశంతోపాటు మట్టి తవ్వకాల విషయంలోనూ మరో రెండు కేసులు వంశీపై నమోదయ్యాయి.
కృష్ణలంక స్టేషన్‌లో వల్లభనేని వంశీ విచారణ
కస్టోడియల్ టార్చర్ కేసులో సొంతంగా దర్యాప్తు - నిందితులను వదిలిపెట్టేది లేదు: రఘురామ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఉన్న ఆయన్ను...ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ..కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారని...అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై వంశీని అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఎదుట వంశీని హాజరుపరచే అవకాశముంది...LOOK