ETV Bharat / state

మహిళల ఖాతాల్లోకి డబ్బులు - చెక్ చేసుకున్నారా? - DEEPAM SCHEME IN AP

దీపం పథకంలో మొదటి సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారులు - మార్చి 31వరకు గడువు

deepam_scheme_apply_online
deepam_scheme_apply_online (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2025, 6:56 PM IST

DEEPAM SCHEME IN AP : కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తోంది. పేదల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన దీపం 2.0 పథకంలో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు వంట గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని గతేడాది అక్టోబర్‌ 31వ తేదీన ప్రారంభించడం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 98 శాతం మందికిపైగా తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమైనట్లు అధికారులు వెల్లడించారు.

'తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు! - అనూహ్యంగా మారుతున్న వాతావరణం'

దీపం పథకం నగదు బ్యాంకు ఖాతాల్లో నమోదైనా గతంలో సెల్​ఫోన్ల నెంబర్ అనుసంధానం కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. 'దీపం' లబ్ధిదారులు రూ.840 చెల్లించి సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే ఆ సొమ్మును ప్రభుత్వం తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.20 చొప్పున రాయితీ ఇస్తుండగా, మిగిలిన రూ.820 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. నేటికీ మొదటి సిలిండర్ బుక్ చేసుకోని వారు మార్చి 31వ తేదీలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

1.08 కోట్ల మంది లబ్ధిదారులు

రాష్ట్ర వ్యాప్తంగా 1.54 కోట్ల డొమెస్టిక్ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా ప్రాథమిక అంచనా ప్రకారం 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత సిలిండర్‌ పథకానికి అర్హత సాధించాయి. అయితే, 1.48 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నప్పటికీ ఆధార్‌ సమర్పించకపోవడంతో అర్హత పొందలేకపోయారు. గ్యాస్‌ కనెక్షన్​తో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వారు మాత్రమే 'దీపం 2.0' పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎవరెవరు అర్హులంటే!

  • దీపం పథకంలో భాగంగా ఉచిత సిలిండర్‌ పొందడానికి ఆధార్, రేషన్‌ కార్డు తప్పనిసరి.
  • కుటుంబంలో ఎవరి పేరుతోనైనా గ్యాస్‌ కనెక్షన్‌ ఉండొచ్చు.
  • లబ్ధిదారు పేరు రేషన్‌ కార్డులో ఉంటే చాలు.
  • భార్య పేరుతో రేషన్‌ కార్డు, భర్త పేరుతో గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా అర్హులే అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • ఒక రేషన్‌ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు లేదా అంతకు మించి గ్యాస్ కనెక్షన్లున్నా రాయితీ ఒక్క దానికే వర్తిస్తుంది.
  • గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ రాయితీ అందుతుంది.
  • గ్యాస్‌ రాయితీ డబ్బులు జమ కావాలంటే E KYC పూర్తి చేసుకోవాలి.
  • E KYC ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ వద్ద పూర్తి చేసుకునే వీలుంది.
  • సిలిండర్‌ తీసుకున్న 48 గంటల్లో సంబంధిత ఇంధన సంస్థలు రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి.
  • లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే 1967 (టోల్‌ ఫ్రీ) నంబరులో సంప్రదించవచ్చు.
  • గ్రామ/వార్డు సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చు.

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారం తీస్తున్నారు! - కొత్త పద్ధతిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు

శేషాచలంలో కలివి కోడి - 'ఈ పక్షిని కనిపెట్టిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.