Latest Innovations on 2025-Fest in Qis Engineering College : ప్రకృతిలో లభించే వనరులతో ఉత్పత్తులు సృష్టిస్తే ఆదాయానికి ఆదాయం, ఖర్చులూ తగ్గించుకోవచ్చు. అలా చిన్న చిన్న ఆలోచనలతోనే సంపద సృష్టించుకోవచ్చునని నిరూపించారు ఆ విద్యార్థులు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన ఆవిష్కరణలతోనూ ప్రశంసలు పొందుతున్నారు. ఆ విద్యార్థులు చేసిన పరిశోధనలు ఎంటో తెలుసుకుందామా?
ప్రకృతిలో అందుబాటులో ఉన్న వనరులతో కొత్త ఆవిష్కరణలకు రూపమిచ్చారు విద్యార్థి బృందం. ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. తక్కువఖర్చుతో ఇంటివద్దనే ఆదాయాలు పెంచుకునేలా పలు ఉత్పత్తులు సృష్టించారు. ప్రకాశం జిల్లా క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన '2025-ఫెస్ట్'లో మెుక్కల నుంచి విద్యుత్, సౌర ఇంధన ఉత్పత్తితో పాటు పలు పరిశోధనలు ప్రదర్శనకు ఉంచారు విద్యార్థులు.
ఆరు రోజులు బిజీ - వీకెండ్లో 'ట్రెక్కింగ్ కింగ్స్' అడ్వెంచర్స్
అలోవెరా మెుక్క నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేశాడు జోయల్స్ అనే విద్యార్థి. బ్యాటరీలో ఉండే నల్లని కడ్డీని ఒక తీగకు, బ్యాటరీ చుట్టూ ఉండే కవచానికి మరో తీగకు అనుసంధానం చేశాడు. వీటిని మెుక్క గుజ్జులోకి వెళ్లేలా చేసి విద్యుత్ ప్రవాహించేలా రూపొందించాడు జోయల్స్. షేక్ ఇమామ్ అనే మరో విద్యార్థి రైతులు ఇబ్బందులు పడకుండా పొలాల్లోనే ఆటోమెటిక్ మోటర్ సిస్టం నమూనా చేశాడు.
పెరట్లో ఔషధ మెుక్కలు పెంచుకొని వాటి ద్వారా సుగంధ ద్రవ్యాలతో పాటు పలు ఉత్పత్తుల తయారీతో ఆదాయం పెంచుకునేలా ప్రాజెక్టు రూపొందించింది ఓ విద్యార్థిని. సౌరవిద్యుత్ ఉపయోగించుకొని వాటర్ ఫిల్టరేషన్ తయారు చేశాడు మరో విద్యార్థి. ఇళ్లల్లో వాడే వాటర్ ఫిల్టర్ విద్యుత్తుతో పనిలేకుండా సోలార్‌తో పనిచేసే యంత్రం తయారు చేశాడు ఓ విద్యార్థి. పశువులశాలలో ఆటోమెటిక్‌గా చల్లదనం అందించే షెడ్డును ఆవిష్కరించింది మరో విద్యార్థిని.
కష్టపడింది - కల నెరవేర్చుకుంది - గీతా భార్గవి విజయగాథ ఇది
గ్రామీణ, సహజ వనరులతో విద్యార్థులు ఇలాంటి ఆలోచనలు చేయడం హర్షించదగ్గ విషయమని కళాశాల కరస్పాండెంట్ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజె క్టులు సృష్టించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు రూపొందించిన నమూనాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
"ప్రతి విద్యార్థి కూడా వారి ప్రతిభతో విభిన్న ఆవిష్కరణలు చేశారు. భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 గా చేసేందుకు, విద్యార్థుల ప్రతిభను బయటకు తీసేందుకు ఈ '2025-ఫెస్ట్' ఏర్పాటు చేశాం. సమస్య ఉన్న ప్రాంతానికి స్వయంగా మా విద్యార్థులు వెళ్లి పరిశోధించి దాదాపుగా 700 రకాల ప్రాజెక్టులు చేశారు." - కళ్యాణ చక్రవర్తి, క్విస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్
'అద్వితీయ 2024' - సందడి చేసిన విద్యార్థినులు - వివిధ రంగాల్లో నైపుణ్య ప్రదర్శన