Police Interrogating Vallabhaneni Vamsi: విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి పోలీసు ఉన్నతాధికారులు వంశీని విచారిస్తున్నారు. పటమట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో వంశీకి ఆధారాలు చూపించి వివరణ తీసుకుంటున్నారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే అభియోగాలతో వంశీపై కేసు నమోదు అయ్యింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో బాధిత కుటుంబం తెలిపిన వివరాలపై వంశీ నుంచి పోలీసులు వివరణ తీసుకున్నారు. విచారణ అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం వంశీని విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి ముందు వంశీని ప్రవేశపెట్టనున్నారు. వల్లభనేని వంశీకి రిమాండ్ విధించాలని పోలీసులు జడ్జిని కోరనున్నారు.
నా నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలని వారు భావిస్తున్నారు- ఎమ్మెల్యే చింతమనేని
ఎందుకు అరెస్టు చేశారో చెప్పలేదు: కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో వంశీని ఆయన భార్య పంకజశ్రీ లాయర్లతోపాటు కలిశారు. తన భర్తను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలియదని అడిగినా కారణం చెప్పడం లేదని పంకజశ్రీ చెప్పారు. తనకు ఇచ్చిన నోటీసులో ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని అరెస్టుకు కారణాన్ని రిమాండ్ రిపోర్టులో తెలియజేస్తామని అన్నారని ఆమె తెలిపారు. రిమాండ్ రిపోర్టుతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ కూడా కోర్టుకు ఇస్తామన్నారని తెలిపారు.
టీడీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే వంశీని టార్గెట్ చేశారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు విమర్శించారు. ఆడపిల్లల పట్ల తప్పుగా మాట్లాడితే ఎవరిదైనా తప్పే అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులపై తాము పోరాటం చేస్తామని మొండితోక జగన్మోహన్ రావు అన్నారు.
'మరోసారి ఇలా చేస్తే సహించేది లేదు' - మంత్రులు, కార్యదర్శులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
'దిల్లీ స్కామ్ కంటే పది రెట్లు పెద్దది' - ఏపీ లిక్కర్ స్కామ్‌పై లోక్‌సభలో ప్రస్తావన