Telugu Desam Parliamentary Party Meeting:ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న ఎంపీలు స్వయంగా హాజరుకాగా దిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఒక సామాన్యమైన కార్యకర్తకు, చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకులుగా ఉన్న మీరు, ఇతర నాయకులతో కూడా అలాగే ఉండాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడి, విధేయతతో ఉంటే పదవులు వస్తాయని దానికి విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడే ఉదాహరణ అని అన్నారు.
అప్పలనాయుడుకు ఎంపీ టిక్కెట్ ఇస్తే చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని అయితే కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని పోయి కలిశెట్టి గెలిచాడని అభినందించారు. అప్పల నాయుడు ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా పార్టీలో ఉన్న సామాన్యులకు టిక్కెట్లు వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు వివరించారు. ఎంపీలందరూ నేటి రాత్రికి, లేదా రేపు ఉదయానికి దిల్లీ చేరుకోవాలని సూచించారు. అప్పల నాయుడూ ఫ్లైట్ టిక్కెట్ ఉందా తీసుకున్నావా అంటూ అప్యాయంగా అడిగారు. లేదంటే చెప్పు మన వాళ్లు టిక్కెట్ బుక్ చేస్తారని చంద్రబాబు ఆరా తీయడంతో కలిశెట్టి భావోద్వేగానికి గురయ్యారు.
నారా లోకేశ్ రెడ్ బుక్ అర్థం ఇదేనా ?- మంగళగిరిలో భారీ ఫ్లెక్సీ - Nara Lokesh Red Book